Cricket News: జాతి విద్వేష ట్వీట్లు చేసిన మరో క్రికెటర్‌

తాజా వార్తలు

Updated : 08/06/2021 15:31 IST

Cricket News: జాతి విద్వేష ట్వీట్లు చేసిన మరో క్రికెటర్‌

లండన్‌: జాతి విద్వేష ట్వీట్ల వ్యవహారంలో ఇంగ్లాండ్‌లో మరో క్రికెటర్‌పై దర్యాప్తునకు రంగం సిద్ధమైంది. యుక్త వయసులో ఆ క్రికెటర్‌ సోషల్‌ మీడియాలో ఆసియా జాతులపై స్త్రీ వివక్ష, జాతి విద్వేష పోస్టులు పెట్టడం గమనార్హం. ఓలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేసిన కొద్ది సమయంలోనే మరొకటి తెరపైకి రావడం అందరినీ విస్తుగొలిపింది.

మరో క్రికెటర్‌ చేసిన ఆ వ్యాఖ్యలను విజ్డెన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ బహిర్గతం చేసింది. అప్పుడా క్రికెటర్‌ వయసు 16 ఏళ్లే కావడంతో పేరు మాత్రం వెల్లడించలేదు. #asianthroughhandthrough # hweollo #chinky హ్యాష్‌ట్యాగులు ఉపయోగించి వ్యాఖ్యలు చేసినట్టు తెలిపింది. దాంతో ఈసీబీ దర్యాప్తు మొదలుపెట్టింది.

‘సోషల్‌ మీడియా వేదికగా మరొక ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జాతి వివక్ష, విద్వేష వ్యాఖ్యలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని మేం దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం’ అని ఈసీబీ అధికార ప్రతినిధి తెలియజేయడం గమనార్హం.

అరంగేట్రం మ్యాచ్‌ ఆడిన ఆల్‌రౌండర్‌ ఓలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా ఈసీబీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు చేసిన పనికి అతడు నిజాయతీగా క్షమాపణలు తెలియజేశాడు! అందుకు తాను చింతిస్తున్నానని, పశ్చాత్తాపడుతున్నానని వెల్లడించాడు. అయినప్పటికీ ఈసీబీ కఠిన చర్యలే తీసుకుంది. అతడిని క్షమించాలని రవిచంద్రన్‌ అశ్విన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, సాంస్కృతిక కార్యదర్శి ఒలీవర్‌ మద్దతు ప్రకటించడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని