close
స్నేహిత్‌కు టైటిల్‌

తెలంగాణ అంతర్‌ జిల్లా టీటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ఫిదెల్‌ ఆర్‌.స్నేహిత్‌ టైటిల్‌ సాధించాడు. బండ్లగూడలోని మహావీర్‌ కళాశాలలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల ఫైనల్లో స్నేహిత్‌ (జీటీటీఏ) 4-2తో అమన్‌ (సీఆర్‌ఎస్‌సీబీ)పై విజయం సాధించాడు. మహిళల ఫైనల్లో ప్రణిత (హెచ్‌వీఎస్‌) 4-3తో వరుణి జైశ్వాల్‌ (జీఎస్‌ఎం)పై నెగ్గి విజేతగా నిలిచింది. క్యాడెట్‌ బాలురలో జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) 4-2తో ఆరుష్‌ (ఏపీజీ)పై.. బాలికల్లో శ్రియ (ఆవా) 4-0తో జలని (వీపీజీ)పై; సబ్‌ జూనియర్‌ బాలురలో జషన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) 4-1తో త్రిశూల్‌ (ఎల్బీఎస్‌)పై.. బాలికల్లో గౌరి (ఎంఎల్‌ఆర్‌) 4-3తో పూజ (ఆవా)పై; జూనియర్‌ బాలురలో కేశవన్‌ కన్నన్‌ (జీఎస్‌ఎం) 4-3తో ప్రణవ్‌ (ఆవా)పై.. బాలికల్లో భావిత (జీఎస్‌ఎం) 4-3తో కీర్తన (హెచ్‌వీఎస్‌)పై; యూత్‌ బాలురలో మహ్మద్‌ అలీ (ఎల్బీఎస్‌) 4-1తో స్నేహిత్‌పై.. బాలికల్లో రాగ నివేదిత (జీటీటీఏ) 4-3తో నైనా జైశ్వాల్‌ (ఎల్బీఎస్‌)పై గెలిచి టైటిళ్లు సొంతం చేసుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.