close
డానియల్స్‌ సీఏ విజయం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్పిన్నర్స్‌ కప్‌ టీ20 (అండర్‌-12) క్రికెట్‌ టోర్నీలో డానియల్స్‌ సీఏ (జూబ్లీహిల్స్‌) ముందంజ వేసింది. ఆదివారం విద్యానగర్‌లోని డానియల్స్‌ క్రికెట్‌ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 13 పరుగుల తేడాతో ఎస్కేఎన్సీఏపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన డానియల్స్‌ సీఏ 20 ఓవర్లలో 114 పరుగులు చేసింది. తోషిత్‌ (50) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిషిత్‌ (3/20) మెరిశాడు. అనంతరం ఛేదనలో ఎస్కేఎన్సీఏ 20 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో రాణించిన తోషిత్‌ (4/20) బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.