IPL 2021: అప్పుడు హిట్‌ బౌలర్‌.. ఇప్పుడు నెట్‌ బౌలర్‌!
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 15/09/2021 07:31 IST

IPL 2021: అప్పుడు హిట్‌ బౌలర్‌.. ఇప్పుడు నెట్‌ బౌలర్‌!

దుబాయ్‌: షెల్డన్‌ కాట్రెల్‌.. పంజాబ్‌ కింగ్స్‌ గతేడాది ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ.8.5 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్న వెస్టిండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో కాట్రెల్‌ను ఈసారి ఫ్రాంఛైజీ వదులుకుంది. వేలంలో అతడిని కొనేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఆడే విండీస్‌ జట్టులో రిజర్వ్‌ ఆటగాడిగాగా ఎంపికైన ఈ పేసర్‌.. ఈనెల 19న యూఏఈలో ఆరంభం కాబోతున్న ఐపీఎల్‌ రెండో దశ టోర్నీలో నెట్‌ బౌలర్‌గా సేవలందించనున్నాడు. కాట్రెల్‌తో పాటు కరీబియన్‌ బౌలర్లు డొమినిక్‌ డ్రేక్స్‌, ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, రవి రాంపాల్‌ కూడా నెట్స్‌లో బంతులేయనున్నారు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున 18 వికెట్లు పడగొట్టిన 36 ఏళ్ల రాంపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ ఆడబోతున్న 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2013-14 సీజన్లో రాంపాల్‌.. బెంగళూరుకు ఆడాడు. ఎడ్వర్డ్స్‌.. ఐపీఎల్‌లో 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌, 2013లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన