close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నర్సాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌...

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: కరోనా కాటుకు సబ్‌ రిజిస్ట్రార్‌ బలయ్యారు. సిద్దిపేటకు చెందిన చింత విజయ్‌కుమార్‌ (40) 2002లో సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. 2002 నుంచి 2021 వరకు వివిధ హోదాల్లో సంగారెడ్డిలోనే విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన పదోన్నతిపై నర్సాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెల 15వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిరోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. శ్వాస ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. విజయ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు