వీఐటీ బిజినెస్‌ స్కూల్‌కు ‘ఏఏసీఎస్‌బీ’ అంతర్జాతీయ గుర్తింపు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీఐటీ బిజినెస్‌ స్కూల్‌కు ‘ఏఏసీఎస్‌బీ’ అంతర్జాతీయ గుర్తింపు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఆధ్వర్యంలోని వీఐటీ బిజినెస్‌ స్కూల్‌కు అసోసియేషన్‌ టు అడ్వాన్స్‌ కాలేజియేట్ స్కూల్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఏఏసీఎస్‌బీ) అంతర్జాతీయ గుర్తింపుదక్కినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఏఏసీఎస్‌బీ అంతర్జాతీయంగా బిజినెస్‌ స్కూళ్లకు గుర్తింపు అందించే సంస్థ అని పేర్కొన్నాయి. ఏఏసీఎస్‌బీ, యూఎస్‌ఏ గుర్తింపు పొంది ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ బిజినెస్‌ స్కూళ్ల సరసన వీఐటీ చేరినట్లు వీఐటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. ఈ గుర్తింపుతో వీఐటీ 58 దేశాలలో 901 బిజినెస్‌ స్కూళ్ల సరసన నిలిచిందని పేర్కొన్నారు. దేశంలో గుర్తింపు పొందిన 15వ బిజినెస్‌ స్కూల్‌ తమదన్నారు. తమిళనాడులో రెండో స్థానంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు