కడప విమానాశ్రయం నుంచి వీజీఎఫ్‌ సేవలు
close

ప్రధానాంశాలు

కడప విమానాశ్రయం నుంచి వీజీఎఫ్‌ సేవలు

ఈనాడు, అమరావతి: కడప విమానాశ్రయం నుంచి చెన్నై-కడప-విజయవాడ మధ్య విమాన సేవలను వయబులిటి గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) విధానంలో మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకం కింద ట్రూజెట్‌ సంస్థ సేవలను అందిస్తోంది. ఈ నెల ఒకటో తేదీతో కేంద్రం అందించే పథకం ముగిసింది. దీంతో సర్వీసును విమానయాన సంస్థ నిలిపేసింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరో ఏడాది పాటు విమాన సేవలను కొనసాగించటానికి అవసరమైన వీజీఎఫ్‌ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. దీనికి రూ.20 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని