250 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు దరఖాస్తు చేసుకోవాలి

ప్రధానాంశాలు

250 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు దరఖాస్తు చేసుకోవాలి

నాయీబ్రాహ్మణులు, రజకులకు అవకాశం: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని నాయీబ్రాహ్మణులు, రజకుల సెలూన్లు, లాండ్రీషాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నామని, దీనికి అర్హులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ సూచించారు. గురువారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటి వరకు 28,550 మంది (17,913 మంది నాయీబ్రాహ్మణులు, 10,637 మంది రజకులు) దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి బీసీ సంక్షేమ అధికారులు, జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు, బీసీ సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి రాహుల్‌బొజ్జా, డిస్కం అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని