close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకసారి కరోనా వచ్చినవారికి ఆరు నెలల రక్షణ

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధనలో వెల్లడి

లండన్‌: ఒకసారి కొవిడ్‌-19 సోకినవారు ఆరు నెలల లోపు రెండోసారి ఆ మహమ్మారి బారినపడే అవకాశం చాలా తక్కువని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వ్యాధి నుంచి కోలుకున్న 5.1 కోట్ల మందికి ఇది ఊరట కలిగించే అంశమని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా మళ్లీ సోకుతోందన్న వార్తలు అక్కడక్కడా వస్తున్నాయి. దీంతో కొవిడ్‌ బాధితుల్లో ఉత్పన్నమైన రోగనిరోధక సామర్థ్యం స్వల్పకాలమే మనుగడలో ఉంటుందని, మళ్లీ వాళ్లు ఆ మహమ్మారి బారినపడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిపై ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మరోసారి కొవిడ్‌ సోకడం చాలా అరుదని వారు తేల్చారు. ‘‘ఒకసారి కరోనా సోకినవారికి కనీసం ఆరు నెలలపాటు ముప్పు ఉండదు. యాంటీబాడీలు ఉన్నవారిలో కొత్తగా వ్యాధి లక్షణాలతో కూడిన ఇన్‌ఫెక్షన్లు కనిపించలేదు. ఇది నిజంగా శుభవార్త. కొవిడ్‌ బాధితుల్లో చాలామంది కొంత కాలంపాటైనా ఈ మహమ్మారి బారినపడకుండా ఉంటారు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేవిడ్‌ చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.