రెండు సముద్రాల మధ్య.. - Sunday Magazine
close

రెండు సముద్రాల మధ్య..

ప్రకృతి చెక్కిన వాయులీన వాద్యాన్ని తలపిస్తున్న ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఓ వైపు బంగాళాఖాతమూ మరో వైపు హిందూ మహా సముద్రమూ చెరో పక్కనా తాకే ఈ తీరానికి ధనుష్కోడి అని పేరు. తమిళనాడు రాష్ట్రంలోని పాంబన్‌ ద్వీపంలో ఉంది. రెండు సాగరాల మధ్యలో కనిపిస్తున్న ఈ రోడ్డును ‘భారతదేశపు చిట్టచివరి రహదారి’గా చెబుతుంటారు. శ్రీరాముడు లంక వెళ్లటానికి ఏర్పాటు చేసుకున్న వంతెన ‘రామసేతు’ ఇక్కడి నుంచే మొదలవుతుందంటారు. ఈ తీరం నుంచి శ్రీలంక దాదాపు 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకప్పుడు జనావాసాలతో కళకళలాడుతూ ఇక్కడ చిన్న పట్టణం ఉండేది. 1964 తుపానుకు ధ్వంసమవ్వడంతో ఇప్పుడా ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. ఇప్పుడైతే ఊరూ లేదూ జనాలూ ఉండరు. కానీ రామేశ్వరం వెళ్లే పర్యటకులు... ఇక్కడికి వచ్చి రెండు సముద్రాల కెరటాల సవ్వళ్లనూ, ప్రకృతి అందాల్నీ ఆస్వాదిస్తుంటారు. ఇంతకీ ధనుష్కోడి అంటే అర్థం తెలుసా... ‘వింటి కొన’ అని!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న