Weekly Horoscope: రాశిఫలం (అక్టోబరు 17 - అక్టోబరు 23) - Sunday Magazine
close

Weekly Horoscope: రాశిఫలం (అక్టోబరు 17 - అక్టోబరు 23)


శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగజీవితం ఉన్నతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలుఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది సౌఖ్యాలున్నాయి. ఒక పనిలో ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రుల అండతో మేలు జరుగుతుంది. శుభవార్త వింటారు. లక్ష్మీస్మరణ మంచిది.


దృష్టయోగముంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో తెలియని అంశాల్లో తలదూర్చవద్దు. విఘ్నాలు ఇబ్బందిపెడతాయి. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. ముఖ్యవ్యక్తుల సహకారంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవండి, కార్యసిద్ధి ఉంటుంది.


వ్యాపార లాభం సూచితం. ధనయోగం అనుకూలం. దైవబలంతో పనులు అవుతాయి. నమ్మకంగా పని ప్రారంభించండి. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించవద్దు. అపనిందలు మోపేవారున్నారు. ఇంట్లోవారి సూచనలు అవసరం. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఖర్చు పెరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి, ఒక పని పూర్తవుతుంది.


త్తమకాలం నడుస్తోంది. శ్రేష్ఠమైన ఫలితం వస్తుంది. ప్రయత్నం బలంగా ఉండాలి. చంచలత్వం వల్ల శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారబలం పెరుగు తుంది. అధికార యోగముంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి, శత్రుపీడ తొలగుతుంది.


బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. వ్యాపార లాభం సూచితం. ఉద్యోగంలో అలసత్వం పనికిరాదు. పై అధికారులతో  అపోహలకు అవకాశమివ్వవద్దు. నమ్మకంతో ముందుకెళ్లండి. వారం మధ్యలో స్వల్ప ఆటంకం ఎదురవుతుంది. పెద్దల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి. పనుల్ని వాయిదా వేయవద్దు. శివస్మరణ మంచిది.


భీష్టసిద్ధి ఉంది. వినయంతో పెద్దల ఆశీర్వచనాన్ని పొందాలి. నూతన మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. గృహయోగం సూచితం, ఇంట్లో శాంతి లభిస్తుంది.బంధు వర్గం నుండి సమస్య ఉంది. వారం మధ్యలో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో మెలకువలు అవసరం. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సూర్యస్తుతి శుభాన్నిస్తుంది.


ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించాలి. నమ్మకంతో పని మొదలుపెట్టండి. సొంత నిర్ణయాలు మేలు. ఇతరులపై ఆధార పడవద్దు. తప్పుదోవ పట్టించే వారుంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆంజనేయస్వామిని స్మరిస్తే మేలు.


శుభాలున్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. నమ్మకం గెలిపిస్తుంది. ధైర్యంగా పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. పదిమందికీ సాయపడతారు. స్నేహితులతో జాగ్రత్త. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యమివ్వాలి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శాంతి లభిస్తుంది.


దృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంటుంది. ఎవరినీ నమ్మవద్దు. వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. బంధుత్వాలు బలపడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, శాంతి లభిస్తుంది.


ర్థికాంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో  శక్తి వంచన లేకుండా పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి. అనుభవం రక్షిస్తుంది. స్వయంగా తీసుకునే నిర్ణయం విజయాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. ఆదిత్యహృదయం శక్తినిస్తుంది.


నోబలంతో విజయం సాధిస్తారు. ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. ముఖ్య వ్యక్తుల సలహాను పాటించండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదముంది. శ్రద్ధతో పనిచేస్తే గందరగోళ పరిస్థితి నుండి బయటపడతారు. ఆత్మీయులతో విభేదించవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధనతో మనశ్శాంతి లభిస్తుంది.


దృష్టయోగముంది. సకాలంలో పని ప్రారంభించండి. అభీష్టప్రాప్తి ఉంటుంది. గౌరవ పురస్కారాలూ రాజ పదవీ లాభముంటాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. శాంత స్వభావంతో ఆలోచిస్తే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారం బాగుంటుంది. రుణసమస్యలు తీరతాయి. ఆదిత్యహృదయం చదివితే మేలు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న