భరోసానిచ్చే యాప్‌లివి
close

Updated : 02/06/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భరోసానిచ్చే యాప్‌లివి

కరోనా, లాక్‌డౌన్‌తో చాలామందికి నాలుగు గోడల మధ్యే బందీ కావాల్సిన పరిస్థితి. దీంతో ఎంతోమంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ భయం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తూనే మానసిక ఆరోగ్యం పెంచే యాప్‌లు ఇవీ...
మైండ్‌షిఫ్ట్‌ (Mindshift)
సలహాలు, సూచనలే కాదు.. ఒత్తిడి నుంచి బయట పడేలా, సొంతంగా ప్రవర్తనను మార్చుకునే సాధన చేసుకునేలా లోతైన సమాచారం ఉంటుందిందులో. తీవ్రతను బట్టి మానసిక వేదనను ఆరు విభాగాలుగా విభజించింది. అందులో మన స్థితి ఏంటో చెబితే దానికనుగుణంగా ప్రాక్టికల్‌ పద్ధతులు వివరించి చెబుతుంది. పరిష్కారాలు సూచిస్తుంది.
వర్చువల్‌ హోప్‌ బాక్స్‌ (Virtual Hope Box)
కంటికి కనిపించకపోయినా మానసిక అనారోగ్యం మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అన్నది వాస్తవం. మానసిక అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న వారికి కొనసాగింపుగా మరింత మానసిక ఉల్లాసాన్ని అందించే మార్గాలు చూపిస్తుందిది. సంగీతం వినిపించడం, స్ఫూర్తిదాయక సూక్తులు, విశ్రాంతినిచ్చే వ్యాయామాల వంటివన్నీ ఇందులో ఉంటాయి.  
మైలైఫ్‌ మెడిటేషన్‌ (MyLife Meditation)
కోపం, నిద్రలేమి, ఆత్రుత, ఆందోళన.. ఎలాంటి స్థితిలో ఉన్నా క్రమపద్ధతిలో ఎలా ధ్యానం చేయాలో చెబుతుంది. శ్వాస వ్యాయామాలు సైతం ఇందులో నేర్చుకోవచ్చు.
పాజిటివ్‌ థింకింగ్‌ (Positive Thinking)
ఈ కష్టకాలంలో ఎవరైనా నాలుగు మంచి మాటలు చెబితే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని భావించే వాళ్లకి బాగా పని చేస్తుందీ యాప్‌. స్ఫూర్తిదాయక సూక్తులు రోజూ పంపుతుంది. కష్టాలకు ఎదురు నిలిచి విజయం సాధించిన వ్యక్తులను పరిచయం చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు