డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో హానర్‌ 5జీ ఫోన్..
close

Published : 22/01/2021 18:22 IST
డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో హానర్‌ 5జీ ఫోన్..

ఇంటర్నెట్‌ డెస్క్‌: హువావే నుంచి విడిపోయి స్వతంత్ర బ్రాండ్‌గా అవతరించిన తర్వాత హానర్‌ కంపెనీ తన తొలి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ వీ40 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో హువావే కంపెనీ తీసుకొచ్చిన వీ30 సిరీస్‌ ఫోన్ల తరహాలోనే హానర్ కొత్త ఫోన్‌ ఉంటుంది. 50 ఎంపీ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్‌ యూఐ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. హెచ్‌డీఆర్‌ 10 సపోర్ట్‌తో పాటు 80-డిగ్రీల కర్వ్‌డ్ ఎడ్జ్‌లు ఉన్నాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌ను‌ ఉపయోగించారు. 

ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక చతురస్రాకార డిజైన్‌తో మూడు, ముందు రెండు కెమెరాలు ఇస్తున్నారు. వెనక 50 ఎంపీ ఆర్‌వైవైబీ సెన్సార్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ షూటర్‌ కెమెరా, 2 ఎంపీ క్లోజప్‌ షాట్స్‌ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌, లేజర్‌ ఆటోఫోకస్‌ ఫీచర్‌ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, టైం ఆఫ్ ఫ్లైట్‌ (టీఓఎఫ్) లెన్స్‌ అమర్చారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది వైర్‌తో 66 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, వైర్‌లెస్‌లో 50 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల వైర్‌తో కేవలం 35 నిమిషాల్లో బ్యాటరీ 100 శాతం, వైర్‌లెస్‌తో 50 శాతం ఛార్జ్‌ అవుతుంది. 8జీబీ ర్యామ్‌/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చారు. మ్యాజిక్‌ నైట్‌, రోస్‌ గోల్డ్‌, టైటానియం సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ముందుగా ఈ ఫోన్ అమ్మకాలు చైనా మార్కెట్లో ప్రారంభంకానున్నాయి. తర్వాత మిగిలిన చోట్ల విడుదల చేయనున్నట్లు హానర్‌ తెలిపింది. చైనా మార్కెట్లో వీ40 ప్రారంభ ధర 3,599 యువాన్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 40,000.

ఇవీ చదవండి..

స్టూడెంట్స్‌ స్పెషల్‌... కొత్త ర్యాంక్స్‌

వాట్సాప్‌లో ఈ సందేశాలు వచ్చాయా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న