WI-FI CALLING: వై-ఫై కాలింగ్‌తో వాయిస్‌ కాల్స్‌ చేసేయండిలా
close

Published : 06/10/2021 18:26 IST

WI-FI CALLING: వై-ఫై కాలింగ్‌తో వాయిస్‌ కాల్స్‌ చేసేయండిలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్న సమయంలో కాల్‌ చేయాలంటే పెద్ద ఇబ్బందే. తక్కువ ఫోన్‌ సిగ్నల్‌ కనెక్టవిటీ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు వై-ఫై నెట్‌వర్క్‌ సాయంతో సాధారణ వాయిస్‌ కాల్స్‌ చేసేందుకు అవకాశం ఉంది. అయితే యూజర్‌ టెలికాం ఆపరేటర్‌ వై-ఫై కాలింగ్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే వై-ఫై కనెక్షన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఈ సేవలను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. భారత్‌లో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్‌ ఐడియా సహా చాలా టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్‌ సదుపాయాన్ని యూజర్లకు అందిస్తున్నాయి. ఈ సేవలకు టెలికాం ఆపరేటర్లు ఎలాంటి రుసుమును వసూలు చేయరు.

వై-ఫై కాలింగ్‌ సర్వీస్‌ మరీ ముఖ్యంగా నెట్‌వర్క్‌ కనెక్టవిటీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు యూజర్‌ తక్కువ ఫోన్‌ సిగ్నల్‌ ఉండే ప్రాంతంలో ఉన్నాడనుకుందాం.. ఫోన్‌ కాల్‌ చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే అక్కడ వై-ఫై సిగ్నల్‌ బాగుంటే వాయిస్‌ కాల్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాల్‌ డ్రాప్‌ లేకుండా వై-ఫై నెట్‌వర్క్‌తో నిరంతరాయంగా మాట్లాడవచ్చు. వై-ఫై కాలింగ్‌ సేవలు VoLTE (వాయిస్‌ ఓవర్‌ LTE)నెట్‌వర్క్‌కు బదులు VoIP (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌) ద్వారా కాల్స్‌ వెళ్తాయి. 

ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలి..?

ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న కొత్త ఫోన్లలో వై-ఫై కాలింగ్‌ సదుపాయం ఉంటుంది. అయితే వై-ఫై కాలింగ్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్‌లోకానీ ఆ ఆప్షన్‌ లేకపోతే కాలింగ్‌ చేసుకునే వీలుండదు. ఆప్షన్‌ ఉన్నవారు ఎనేబుల్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..  

 ఆండ్రాయిడ్‌లో ఇలా..

* ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి. నెట్‌వర్క్‌ (కనెక్షన్స్‌ లేదా మొబైల్‌ నెట్‌వర్క్‌ సెక్షన్‌)ను క్లిక్‌ చేయాలి

* నెట్‌వర్క్‌ సెక్షన్‌లోని వై-ఫై ప్రిఫరెన్స్‌కు వెళ్లి అడ్వాన్స్‌డ్‌ క్లిక్‌ చేయాలి

* వై-ఫై కాలింగ్‌ ఆప్షన్‌ ఉందో లేదో చెక్‌ చేయాలి

* మీ ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉంటే దానిలో ఏ సిమ్‌ కార్డుతో కాల్స్‌ చేయాలో  ఎంచుకోవాలి. సబ్‌స్క్రైబర్స్‌ రెండు సిమ్‌ కార్డులకు ఎనేబుల్‌ చేసుకోవచ్చు

* కొన్ని ఫోన్లలో డైరెక్ట్‌గా సిమ్‌ కార్డ్‌ ఆప్షన్లలోనే వై-ఫై కాలింగ్‌ను ఎంపి చేసుకునే వెసులుబాటు

ఐఓఎస్‌లో ఇలా చేసుకోవచ్చు..

* ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి. ఫోన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి

* మొబైల్‌ డేటా > వై-ఫై కాలింగ్‌ (మీ టెలికాం ఆపరేటర్‌ సపోర్ట్‌ చేస్తేనే అందుబాటులో ఉంటుంది)

* ‘‘వై-ఫై కాలింగ్‌ ఆన్‌ దిస్‌ ఐఫోన్‌’’ ఎంచుకోవాలి. 

* ఫోన్‌లో వై-ఫై కాలింగ్‌ అందుబాటులో ఉంటే స్టేటస్‌ బార్‌లో యూజర్‌ నేమ్‌ కనిపిస్తుంది. ఇక వై-ఫై కాలింగ్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న