Laptops: రియల్‌.. షావోమి నోట్‌బుక్స్‌ వస్తున్నాయ్‌!
close

Published : 14/07/2021 18:53 IST
Laptops: రియల్‌.. షావోమి నోట్‌బుక్స్‌ వస్తున్నాయ్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాప్‌టాప్ లేనిదే పనిజరగదు. ఆఫీస్ వర్క్‌, ఆన్‌లైన్ క్లాస్‌..ఇలా ప్రతి అవసరానికి ల్యాపీ తప్పనిసరి. కరోనా కారణంగా పరిస్థితులు మారిపోవడంతో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షావోమి, రియల్‌మీ కంపెనీలు త్వరలో తీసుకురానున్న ల్యాప్‌టాప్‌ మోడళ్ల వివరాలు తెలుసుకుందాం. 

షావోమి ఎంఐ నోట్‌బుక్ 14 ప్రో

ఈ ల్యాప్‌టాప్ విడుదలకు సంబంధించి షావోమి ఇప్పటికే ‘మీకు నచ్చే ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్’ చెప్పమంటూ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఈ నెల చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ ల్యాప్‌టాప్ విడుదల చేయనున్నారట. ఇందులో ఇంటెల్‌ 11 జనరేషన్ టైగర్‌ లేక్‌ ఐ7 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. నివిదా జీఈఫోర్స్‌ గ్రాఫిక్‌ కార్డ్ ఇస్తున్నారట. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ కేవలం 35 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందట. 120హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 15.6-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారని తెలుస్తోంది. 16జీబీ ర్యామ్‌ + 512జీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్‌డిస్క్‌తో రానుంది. దీని ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

రియల్‌మీ బుక్‌

రియల్‌మీ తన తొలి ల్యాప్‌టాప్ బుక్‌ను వచ్చే నెలలో భారత్‌లో విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో 14-అంగుళాల డిస్‌ప్లేతోపాటు ఎఫ్‌హెచ్‌డీ ఎల్‌ఈడీ యాంటీ-గ్లేర్ ప్యానెల్ ఇస్తున్నారట. ఐ3, ఐ5 ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ మ్యాక్‌ బుక్‌ ప్రో తరహాలో రియల్‌మీ బుక్ డిజైన్ ఉంటుందని సమాచారం. ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు యూఎస్‌బీ-సీ టైప్, 3.5ఎమ్‌ఎమ్‌ జాక్‌, యూఎస్‌బీ-ఏ టైప్ ఫీచర్లు ఇస్తున్నారట. ర్యామ్‌, స్టోరేజ్‌లకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. సుమారు రూ. 40 వేల ధరలో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న