Xiaomi Smarter Gadgets: కొత్త బ్యాండ్.. సరికొత్త ల్యాపీ... పెద్ద టీవీ
close

Updated : 27/08/2021 15:22 IST

Xiaomi Smarter Gadgets: కొత్త బ్యాండ్.. సరికొత్త ల్యాపీ... పెద్ద టీవీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షావోమి గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల శ్రేణిలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. స్మార్ట్‌ లివింగ్ 2022 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ జాబితాలో ల్యాప్‌టాప్, ఫిట్‌నెస్ బ్యాండ్, స్మార్ట్‌టీవీ, వైఫై రూటర్, షూస్‌ ఉన్నాయి. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లు, ధర వంటి వివరాలు గురించి తెలుసుకుందాం. 


ఎంఐ బ్యాండ్6

గతంలో విడుదల చేసిన బ్యాండ్5కి కొనసాగింపుగా షావోమి కంపెనీ ఎంఐ బ్యాండ్6ని తీసుకొచ్చింది. పెద్ద డిస్‌ప్లే, అధిక బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బ్యాండ్‌లో 450 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 1.56-అంగుళాల అమోలెడ్ టచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.80 కస్టమైజబుల్ ఫేసెస్, 30 రకాల వర్కవుట్ మోడ్స్‌, సిక్స్‌ యాక్సిస్‌ పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్‌, స్లీప్‌ మానిటరింగ్, ఆరీఈఎం (రాపిడ్ ఐ మూమెంట్), స్ట్రెస్ మానిటరింగ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ గైడ్‌, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. 5ఏటీఎం వాటర్‌ రెసిస్టెన్స్‌ ఇస్తున్నారు. నోటిఫికేషన్స్‌, మెసేజ్‌, కాల్స్‌ అలర్ట్‌ ఫీచర్స్‌తోపాటు మ్యూజిక్, కెమెరా షట్టర్ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది.  దీని ధర రూ. 3,499. ఆగస్టు 30 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


ఎంఐ నోట్‌బుక్‌ ల్యాప్‌టాప్‌

ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా, నోట్‌బుక్ ప్రో పేరుతో రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చారు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో విండోస్‌ 10 ఓఎస్‌ ఇస్తున్నారు. దీన్ని విండోస్‌ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ పవర్‌ బటన్‌, పెద్ద ట్రాక్‌పాడ్, బ్యాక్‌లిట్ సిస్సర్ కీబోర్డ్‌, డీటీస్‌ ఆడియోతో రెండు 2వాట్‌ స్పీకర్లు, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ టైప్‌-సీ, యూఎస్‌బీ టైప్‌-ఏ వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లలో ఉన్నాయి. 

నోట్‌బుక్‌ అల్ట్రాలో 90Hz రిఫ్రెష్‌రేట్‌తో 15.6-అంగుళాల 3,200x2,000 పిక్సెల్ ఎంఐ-ట్రూలైఫ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇంటెల్ ఐ7-11370హెచ్‌ ప్రాసెసర్ ఉపయోగించారు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 65వాట్ యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్ ఇస్తున్నారు. 16జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌/512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ ఇస్తున్నారు. మూడు రకాల కాన్ఫిగరేషన్స్‌తో ఈ ల్యాప్‌టాప్‌ లభిస్తుంది. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్‌/8జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 59,999గాను, ఇంటెల్‌ ఐ5 ప్రాసెసర్‌/16జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర రూ. 63,999గా, ఐ7 ప్రాసెసర్‌/16జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర రూ. 76,999గా షావోమి నిర్ణయించింది. 

నోట్‌బుక్‌ ప్రోలో  2,560x1,600 పిక్సెల్‌తో 14-అంగుళాల 2.5K డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులోకూడా ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ ఉపయోగించారు. 16జీబీ ర్యామ్‌/512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 11 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఐ5 ప్రాసెసర్‌/8జీబీ ర్యామ్‌ ధర రూ. 56,999. ఐ5 ప్రాసెసర్‌/16జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 59,999. ఐ7 ప్రాసెసర్‌/16జీబీ వేరియంట్‌ ధర రూ. 72,999. ఆగస్టు 31 నుంచి ఎంఐ, అమెజాన్ వెబ్‌సైట్‌, ఎఐం హోమ్‌ స్టోర్లలో కొనుగోలు చెయ్యొచ్చు. 


ఎంఐ టీవీ 5ఎక్స్‌ సిరీస్‌

యూజర్‌కి మెరుగైన వీడియో అనుభూతిని అందించేందుకు ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్2ను ఉపయోగించారు. ఇందులోని ఫొటోఎలక్ట్రిక్ సెన్సర్‌ అడాప్టివ్ బ్రైట్‌నెస్‌ ఫీచర్‌ను అందిస్తుంది. 4k రిజల్యూషన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. డాల్బీ విజన్‌, హైబ్రిడ్ లాగ్ గామా, హెచ్‌డీఆర్‌ 10, హెచ్‌డీఆర్‌ 10+ని ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్ స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ10 ఆధారిత పాచ్‌వాల్4తో పనిచేస్తుంది. 30 రకాల స్ట్రీమింగ్ సేవలకు సంబంధించిన కంటెంట్‌ను యూజర్‌కి అందించేందుకు షావోమి ఐఎండీబీతో జట్టుకట్టింది. అలానే 75 లైవ్ ఛానల్స్‌ని పాచ్‌వాల్ ఉచితంగా అందిస్తుంది. కిడ్స్‌మోడ్‌, సేఫ్ సెర్చ్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. గేమర్స్‌ కోసం ఆటో లో లాటెన్సీ మోడ్ ఇస్తున్నారు. 64బిట్ క్వాడ్‌కోర్ ఏ55 ప్రాసెసర్‌, మలి జీ52 ఎంపీ2 గ్రాఫిక్స్ కార్డు ఉపయోగించారు. 2జీబీర్యామ్‌/16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఇస్తున్నారు. మూడు వేరియంట్లలో ఈ టీవీ లభిస్తుంది. 43-అంగుళాల డిస్‌ప్లే ధర రూ. 31,999గాను, 50-అంగుళాల ధర రూ. 41,999గా, 55-అంగుళాల డిస్‌ప్లే ధర రూ. 47,999గా షావోమి నిర్ణయించింది. సెప్టెంబరు 7 నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్‌, ఎంఐ స్టూడియో, క్రోమ్‌ వెబ్‌సైట్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 


వీటితోపాటు షూస్‌, వైఫై రూటర్, హోం సెక్యూరిటీ కెమెరాలను విడుదల చేసింది. ఎంఐ రూటర్ 4ఏ గిగాబైట్ ఎడిషన్‌లో డ్యూయల్‌కోర్ మీడియాటెక్‌ ఎంటీ7621ఏ మిప్స్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 1,167ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. యాంటీ హ్యాకింగ్‌ ప్రొటెక్షన్, పేరెంటల్ కంట్రోల్, వైఫై ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. దీని ధర రూ. 2,199. 

ఎంఐ 360 హోం సెక్యూరిటీ కెమెరా 2k వీడియో రిజల్యూషన్‌తో వీడియోలను అందిస్తుంది. ఇందులో ప్రైవసీ షీల్డ్‌, వైఫై కనెక్టివిటీ, 2-వే వాయిస్‌ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని ఎఫ్‌1.5 అపార్చర్, హై సెక్యూరిటీ ఇమేజ్‌ సెన్సర్‌ తక్కువ లైట్‌లో కూడా క్వాలిటీ వీడియోలను అందిస్తుంది. దీని ధర రూ. 4,499. 

షావోమి రన్నింగ్ షూస్‌ని 5 ఇన్‌ 1 అడ్వాన్స్‌డ్‌ యూనీ మౌల్డింగ్ టెక్నాలజీతో తయారుచేశారు. ఈ షూస్‌లో 4డీ ఫ్లై వోవెన్‌ అప్పర్‌, హెర్రింగ్‌బోన్ లాకింగ్‌ సిస్టమ్‌ ఉంది. వీటిని వాషింగ్ మెషీన్‌లో వేసి వాష్ చేసుకోవచ్చు. ఈ షూస్ ధర రూ. 2,699. బ్లాక్, బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తున్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న