విపత్తులో విడిచిపెట్టను..

విశ్వాసి జీవితంలో అనేక కష్టాలు, శోధనలు వస్తాయి. అలాంటి సమయాల్లో చాలామంది కుంగు బాటుకు గురవుతారు. దావీదు మహారాజుకు కూడా కష్టాలు వచ్చాయి.

Published : 10 Nov 2022 00:08 IST

విశ్వాసి జీవితంలో అనేక కష్టాలు, శోధనలు వస్తాయి. అలాంటి సమయాల్లో చాలామంది కుంగు బాటుకు గురవుతారు. దావీదు మహారాజుకు కూడా కష్టాలు వచ్చాయి. కానీ ఆయన వాటికి కుంగిపోలేదు. ‘నేను బిగ్గరగా అరుస్తూ యెహోవాను ప్రార్థించినప్పుడు.. ఆయన నాకు జవాబిస్తాడు’ అన్నాడు. తనను ఆదుకోమంటూ క్రీస్తును నమ్మకంతో ప్రార్థించాడు. దేవుడు కూడా కష్టాల్లో ఉన్న తన ప్రజల్ని నిర్లక్ష్యం చేయడు. ‘పర్వతాలు దద్దరిల్లినా, మరెలాంటి విపత్తులు సంభవించినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను’ అని సెలవిచ్చాడు. కాబట్టి ఆపద సమయాల్లో విశ్వాసం, ధైర్యం కోల్పోకుండా ప్రార్థిస్తే వాటినుంచి బయట పడటానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు.    

- జి.ప్రశాంత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు