జ్వరాన్ని నిందించకండి

ఒకసారి ఉమ్ముస్సాయిబ్‌ అనే వృద్ధురాలు జ్వరంతో మంచం పట్టింది. ఆమెను పరామర్శించడానికి ముహమ్మద్‌ ప్రవక్త (స) వెళ్లారు.

Updated : 17 Nov 2022 00:39 IST

ఒకసారి ఉమ్ముస్సాయిబ్‌ అనే వృద్ధురాలు జ్వరంతో మంచం పట్టింది. ఆమెను పరామర్శించడానికి ముహమ్మద్‌ ప్రవక్త (స) వెళ్లారు. పక్కనే కూర్చుని ఆరోగ్యస్థితిని వాకబు చేస్తూ ‘ఇప్పుడెలా ఉందమ్మా?’ అనడిగారు. ‘ఈ పాడు జ్వరం నన్ను చుట్టుకుని యాతన పెడుతోంది’ అందామె.   అది విని ప్రవక్త ‘జ్వరాన్ని నిందించకూడదు. కొలిమిలోని నిప్పు ఇనుముకు పట్టిన తుప్పును వదలగొట్టి శుభ్రం చేసినట్టు జ్వరం విశ్వాసుల పాపాలను పోగొట్టి పవిత్రంగావిస్తుంది. వ్యాధికి గురిచేసి, స్వస్థత చేకూర్చేది అల్లాహ్‌ యే’ అంటూ వివరించారు ప్రవక్త.

- అస్మత్‌ బేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని