దేవుడు ప్రేమ స్వరూపి

ప్రభువు ప్రేమ నిత్యం, సత్యం, శాశ్వతం, సర్వోన్నతం. అది మన ఊహకు అందనిది, మాటల్లో ఇమడినిది.

Published : 05 Jan 2023 00:09 IST

ప్రభువు ప్రేమ నిత్యం, సత్యం, శాశ్వతం, సర్వోన్నతం. అది మన ఊహకు అందనిది, మాటల్లో ఇమడినిది. మరెవ్వరూ అందించలేనిది. తల్లి బిడ్డను మరవచ్చేమో గానీ నేను నిన్ను మరువను అన్నాడు ప్రభువు. దేవుడి ఆజ్ఞలను, నియమ నిబంధనలను అనుసరించడమే మనం చేయాల్సింది. అలా చేసినప్పుడే పవిత్ర జీవితం సాధ్యమౌతుంది. దేవుడు మనల్ని ప్రేమించినట్లే ఇతరులను మనం ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు క్రీస్తు. ఆప్తులనే కాదు, శత్రువులనూ ప్రేమించాలన్నాడు. దేవుణ్ణి మనం ఆరాధించడం కాదు గానీ ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. తనను నమ్మే ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందేలా చేశాడు. తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపి సిలువపై బలిదానం చేసి పాపులకు కూడా రక్షణమార్గం ఏర్పాటు చేశాడు. దైవం ఔన్నత్యానికిది నిదర్శనం.

బందెల స్టెర్జి రాజన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని