ఈశ్వరాశ్రయం

కోరికలను అదుపు, ఆహారాన్ని పొదుపు చేయాలి. ఆశ లేకుంటే మనుగడ లేదు అన్నది నిజమే. కానీ దానికి హద్దూ అదుపూ ఉండాలి- అన్నారు పుట్టపర్తి సాయిబాబా.

Published : 16 Mar 2023 00:40 IST

కోరికలను అదుపు, ఆహారాన్ని పొదుపు చేయాలి. ఆశ లేకుంటే మనుగడ లేదు అన్నది నిజమే. కానీ దానికి హద్దూ అదుపూ ఉండాలి- అన్నారు పుట్టపర్తి సాయిబాబా. మనం కాలం, ధనం, శక్తి, ఆహారాలను వృథా చేస్తున్నాం. వీటిని పొదుపు చేయగలిగితే దేనికీ కొరత ఉండదు. దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. పొదుపుతో అవస్థ లేకపోవడమే కాదు, ప్రశాంతత కలుగుతుంది. పైగా ఆర్భాటాలు లేకపోవడం ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఈశ్వరుడిచ్చిన పంచభూతాలను సవ్యంగా ఉపయోగిస్తే ఆయుష్షు పెరుగుతుంది. అనారోగ్యాలు కలగవు, కరవుకాటకాలు రావు. దేశం సస్యశ్యామలమవుతుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి ప్రళయతాండవాలు ఉండవు. పొదుపును విస్మరిస్తే ఈశ్వరుని విస్మరించినట్లే. పొదుపు అన్నింటా, అన్నివేళలా పాటించాల్సిందే. పొదుపు పిసినారితనం కాదు, కోరికలను అదుపు చేయడం. పొదుపు పాటించడం అంటే ఈశ్వరుని ఆశ్రయించినట్లే అవుతుంది.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని