కృష్ణ్ణుడు.. గురుదక్షిణ

మన సంస్కృతిలో గురువునెంతో గౌరవించడం, మాట నిలబెట్టు కోవడం కోసం ఎంతటి కష్టాలనూ లెక్కచేయకపోవడం కనిపిస్తుంది.

Published : 16 Mar 2023 00:40 IST

న సంస్కృతిలో గురువునెంతో గౌరవించడం, మాట నిలబెట్టు కోవడం కోసం ఎంతటి కష్టాలనూ లెక్కచేయకపోవడం కనిపిస్తుంది. బలరామకృష్ణులకు సాందీపుడు సకల విద్యలూ నేర్పించాడు. వేద వేదాంగాలూ, ధర్మ, తర్క, న్యాయ, గణితాది శాస్త్రాలూ అభ్యసించిన తర్వాత.. ‘మీ దయవల్ల కృతార్థులమయ్యాం. ఇతరులకు సులభం కానిది ఏదైనా అడిగితే, ఆ పని చేసి గురుదక్షిణ సమర్పించుకుంటాం గురువర్యా’ అంటూ పాదాభివందనం చేశారు సోదరులిద్దరూ.

సాందీపుడు తల పంకించి కొన్నాళ్ల్ల క్రితం మాయమైన తన పుత్రుణ్ణి తెచ్చివ్వమని కోరాడు. తమ ఒక్కగానొక్క కొడుడు అదృశ్యమైనందుకు ఆ ఆలుమగలు అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. తప్పకుండా తెచ్చిస్తామని గురువుగారికి మాటిచ్చారు బలరామకృష్ణులు. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్లి గురుపుత్రుడి కోసం వెతకసాగారు. అది చూసిన సముద్రుడు, స్నానం చేయడానికి వచ్చిన ముని కుమారుణ్ణి పంచజనుడనే రాక్షసుడు మింగేసిన సంగతి తెలియజేశాడు. ఇక బలరామకృష్ణులు పంచజనుణ్ణి వెతుక్కుంటూ వెళ్లి, అతడితో యుద్ధం చేసి హతమార్చారు. తర్వాత గురుపుత్రుడి కోసం కృష్ణుడు యుమలోకానికి వెళ్ల్లాడు. యముడు తన వద్ద భద్రంగా దాచి ఉంచిన సాందీపుని కుమారుణ్ణి కృష్ణుడికి అప్పగించాడు. అతణ్ణి గురుదంపతుల వద్దకు చేర్చి తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు బలరామకృష్ణులు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని