భిక్షపై మమకారం

శ్రావస్తి నగరంలో గౌతమబుద్ధుడి అయిదుగురు శిష్యులు కొన్నాళ్లకి బౌద్ధభిక్షువులయ్యారు. ఒక వీధిలో ఓ పెద్దావిడ చాలా రుచిగా వంటచేసేది.

Published : 16 Mar 2023 00:39 IST

శ్రావస్తి నగరంలో గౌతమబుద్ధుడి అయిదుగురు శిష్యులు కొన్నాళ్లకి బౌద్ధభిక్షువులయ్యారు. ఒక వీధిలో ఓ పెద్దావిడ చాలా రుచిగా వంటచేసేది. భిక్షువులకు ఆతిథ్యం ఇవ్వటమే కాక, అభిమానంగా చూసేది. దాంతో వాళ్లు ఆ వీధిలో ఎన్ని ఇళ్లున్నా ఆమె ఇంటికే భిక్షకు వెళ్లేవారు. కొన్నిసార్లు తమకిష్టమైన వంటలు ముందే చెప్పి చేయించుకునేవారు. అలా ఆ ఆతిథ్యానికి ఆకర్షితులైపోయారు. భిక్షపై మమకారం పెంచుకున్నారు. ఒకరోజు ఆమెకి తీవ్ర అస్వస్థత కలిగింది. వైద్యులొచ్చి పరీక్షించేలోపే కన్నుమూసింది. అది తెలిసి భిక్షువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెనీ, వంటలనూ తలచుకుంటూ కుమిలిపోసాగారు.

కొద్దిసేపటికి గౌతమబుద్ధుడు వచ్చాడు. ఆనందంగా ఉండాల్సిన సన్యాసులు విలపిస్తూ ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు. సంగతి తెలిసి ‘మీకింకా ఇహలోక వాంఛలు పోలేదు. తాపత్రయం తగ్గలేదు. కుటుంబాలను వదులుకుని వచ్చిన మీరిలా మమకారం పెంచుకోవడం ఎంత శోచనీయం! సన్యాసం స్వీకరించి కూడా రుచులకు బందీలయ్యారా?  ఇక ఆధ్యాత్మిక సాధన ఎలా చేస్తారు? ముందు జిహ్వచాపల్యం నుంచి బయటకు రండి!’ అన్నాడు.      

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని