దేవుని వాగ్దానం

కృపామయుడైన దేవుడు ప్రజలకు మేలు చేస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం హృదయ పూర్వకంగా విశ్వసించాలి. ప్రభువు చేసిన మేలును నిరంతరం నెమరేసుకోవాలి, తృప్తి చెందాలి.

Published : 29 Feb 2024 00:13 IST

క్రీస్తువాణి

కృపామయుడైన దేవుడు ప్రజలకు మేలు చేస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం హృదయ పూర్వకంగా విశ్వసించాలి. ప్రభువు చేసిన మేలును నిరంతరం నెమరేసుకోవాలి, తృప్తి చెందాలి. ఇంకేవో తక్కువయ్యాయనే అసంతృప్తితో బాధ పడటం తగదు. తనను ప్రేమించేవారి కోసం ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. దేవుడు ఆదాము, హవ్వలను ఆశీర్వదించాడు. తన స్వరూపంలో సృజించిన నరునికి- తానే సృష్టించిన జలచరాలను ఏలుటకు అధికారం అనుగ్రహించాడు. ఫలానా చెట్టు జోలికి వెళ్లొద్దు.. ఆ పండ్లు తింటే మరణిస్తారు- అని హితవు పలికాడు. కానీ సాతాను ఆ మాటలను తారుమారు చేశాడు. ‘దేవుడు వద్దన్న ఫలాలు తింటే మీ కళ్లు తెరుచుకుంటాయి. మంచిచెడుల తారతమ్యం తెలుసుకుని దేవతల్లా మారతారు’- అన్నాడు. అలా దేవుడి మాటలను వక్రీకరించి, ఆయన మార్గం నుంచి తప్పించి, ఈ లోకంలో ఉన్నవాటినే ఉన్నతంగా చూపించాడు. దాంతో వారిద్దరూ దేవుడి ఆశీర్వాదం పోగొట్టుకుని, ఆయన ఆగ్రహానికి గురయ్యారు, దుఃఖంలో మునిగారు. కనుక మనం దేవుడి మాటలే నమ్మి, ఆచరించి, ఆనందించి, శక్తిని పొందాలి. అసంతృప్తి, నిరాశలకు దూరంగా ఉండి, ఉన్నదానితో తృప్తి చెందితే.. జీవితం మూడు పూలూ ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

డా.సి.ప్రసన్నకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని