స్వర్ణ వర్ణ శోభితం ఆదిత్యుని విగ్రహం

సూర్యనారాయణ దేవాలయంగా పిలుచుకునే అరసవిల్లి క్షేత్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా రెండు పర్యాయాలు భానూదయ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయం నిర్మితమైంది.

Published : 07 Mar 2024 00:17 IST

మార్చి 9 నుంచి సూర్యకిరణ స్పర్శ

సూర్యనారాయణ దేవాలయంగా పిలుచుకునే అరసవిల్లి క్షేత్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా రెండు పర్యాయాలు భానూదయ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయం నిర్మితమైంది. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అశేషంగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దేవస్థాన ప్రాంగణంలోని మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యభగవానుడి తొలికిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అలాగే అక్టోబర్‌ 1, 2, 3, 4 తేదీల్లో ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాన్ని తిలకిస్తే చేసిన పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.  

ప్రజల క్షేమాన్ని ఆశించి కశ్యప మహర్షి ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పద్మ పురాణం పేర్కొంది. ఈ ఆలయంలో సూర్యుణ్ణి పూజించిన వారు కష్టాలు తొలగి హర్షంతో తిరిగెళ్తారు కనుక ఈ ఊరిని హర్షవల్లిగా పిలిచేవారనీ, అదే క్రమేణా అరసవిల్లిగా మారిందని చెబుతారు. సకల జీవులకూ ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి రెండు చేతులూ అభయ ముద్రలోనే ఉండటం విశేషం.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని