దేవుడి ముందే తలవంచాలి!

ఒకసారి బీజాపుర్‌ సేనాధిపతి తన పన్నెండేళ్ల కుమారుణ్ణి తీసుకుని సుల్తాన్‌ వద్దకు వెళ్లాడు.

Published : 14 Mar 2024 00:03 IST

కసారి బీజాపుర్‌ సేనాధిపతి తన పన్నెండేళ్ల కుమారుణ్ణి తీసుకుని సుల్తాన్‌ వద్దకు వెళ్లాడు. నాటి రాజుల పద్ధతి ప్రకారం సేనాధిపతి తలవంచి చేతిని మూడు సార్లు నేలకు తాకిస్తూ సుల్తాన్‌కు సలాం చేశాడు. తన పుత్రుణ్ణి కూడా అలాగే నమస్కరించమని సైగ చేశాడు. కానీ ఆ బాలుడు సున్నితంగా తిరస్కరిస్తూ ‘దేవుడి ముందు తప్ప, మరెవరి ముందూ తల వంచవద్దని అమ్మ చెప్పింది. అలాంటిది.. పరాయి పాలకుల ఎదుట తల వంచాలా?! నాకు ఇష్టంలేదు’ అంటూ ఠీవిగా దర్బారు నుంచి బయటకు వచ్చాడు. బీజాపుర్‌ సుల్తాన్‌ ఎదుట అంత సాహసాన్ని ప్రదర్శించినవారు ఎవరూ లేరు. ఆ ధీరబాలుడే జిజియా బాయి తీర్చిదిద్దిన ఛత్రపతి శివాజీ. తదనంతర కాలంలో ఆయనే ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసుకు ప్రియశిష్యుడు, భవానీదేవి భక్తుడు అయ్యాడు. ధర్మ పరిరక్షణలో విశేషపాత్ర పోషించాడు. పరాయి పాలనలో అస్తిత్వం కోల్పోతున్న ఆలయాలకు రక్షణ కల్పించాడు. స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ‘చిన్నతనంలోనే దేశభక్తి, ధర్మంపై అనురక్తి, స్వాభిమానం పెంపొందడానికి అమ్మ నేర్పిన రామాయణ, మహాభారత కథలే కారణం. మన ధర్మభూమిలో జన్మించిన వీరులు, వారి ఆధ్యాత్మిక శక్తే నాకు గొప్ప స్ఫూర్తి’ అనేవాడు శివాజీ.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని