మాటలు తేనెలా ఉండాలి!

బైబిల్‌ మన వాక్కు తేనె కంటే మధురంగా ఉండాలని తెలియజేసింది.

Published : 14 Mar 2024 00:02 IST

బైబిల్‌ మన వాక్కు తేనె కంటే మధురంగా ఉండాలని తెలియజేసింది. మన మాటలు తోటివారికి సంతోషం కలిగించేలా ఉండాలని ప్రభువు అనేక సందర్భాల్లో కోరాడు. మనం దైవాన్ని విశ్వసించినప్పుడు.. రాజాధిరాజైన ఏసు కుమారుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన గుణగణాలను అనుసరించేందుకు ప్రయత్నించాలి. ప్రభువు ఔన్నత్యం మనలోనూ ఉట్టిపడుతుండాలి. ఆలోచనలు అమూల్య ఆభరణాల్లా ఉండాలి. మనం వ్యక్తంచేసే అభిప్రాయాలు అంతరాత్మ అంగీకరించి, ఆమోదించేలా ఉండాలి. మన ప్రవర్తన లోపరహితంగా ఉండేట్లు తీర్చిదిద్దుకోవాలి. తోటివారు తెలిసీ తెలియక తప్పు చేసిన సందర్భాల్లో మృదువుగా నచ్చజెప్పాలే కానీ కఠినంగా మందలించకూడదు. వారిని సాతాను బంధనాల నుంచి విడుదల చేసి, దైవం గురించిన అవగాహన కలిగించాలి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో ప్రవేశిస్తుంది. మన జీవితం ధన్యమౌతుంది. దావీదు భక్తుడు మన ప్రవర్తన సువాసనలు వెదజల్లుతూ, అనేక వ్యాధులకు ఔషధంలా పనిచేసే ‘జఠామాంసి’ అనే మొక్కలా ఉండాలని చెప్పాడు.

డా.సి.ప్రసన్నకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని