ఆరోగ్యదాయకం ఆదిత్యహృదయ పఠనం

లోకానికి వెలుగు ప్రసాదించే దైవం సూర్యభగవానుడు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసరింపచేసే ప్రత్యక్ష దైవం.

Published : 28 Mar 2024 00:04 IST

లోకానికి వెలుగు ప్రసాదించే దైవం సూర్యభగవానుడు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసరింపచేసే ప్రత్యక్ష దైవం. తన లేత కిరణాలతో లోకానికి మేలుకొలుపు పలికే దినకరుణ్ణి సూర్యనమస్కారాలతో స్వాగతిస్తాం. ఆదిత్య హృదయం పఠించి ఆరాధిస్తాం. ఇది ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. అనుకున్న పనులు నెరవేరాలనే దృఢసంకల్పంతో ఆదిత్య హృదయం పఠిస్తే విజయం తథ్యమంటారు. శత్రుబాధ నివారణ కూడా ఈ స్తోత్రంతో సాధ్యమని నమ్ముతారు. రావణాసురుడితో యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ఆదిత్యహృదయం పఠించాడు శ్రీరామచంద్రుడు. లోకకంటకుడైన రావణుణ్ణి అవలీలగా జయించాడు. ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం శ్రేష్ఠం. ఇది అన్ని రాశుల వారికీ క్షేమదాయకం. ఉదయానే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి, ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. సమస్త జీవరాసులకూ జీవనాధారమైన సూర్యభగవానుణ్ణి మహాశక్తిమంతమైన ఆదిత్య హృదయంతో ఆరాధించి, ఆశీర్వాదాలు పొందుదాం.

ఎల్‌.ప్రఫుల్ల చంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని