లోకాన్ని జయించే విశ్వాసం

నేటి సమాజంలో నిలకడలేని జీవితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఉండకూడదంటే.. దైవం పట్ల విశ్వాసం ఎంతో అవసరమని బైబిల్‌ చెబుతోంది.

Updated : 04 Apr 2024 00:36 IST

నేటి సమాజంలో నిలకడలేని జీవితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఉండకూడదంటే.. దైవం పట్ల విశ్వాసం ఎంతో అవసరమని బైబిల్‌ చెబుతోంది. ఏసుప్రభువును నమ్మి, ఆయనపై ఆధారపడమని, ఆ నమ్మకంతోనే నిలకడగా ఉంటారని కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు చెప్పాడు. విశ్వాసం లేకపోవడం వల్ల.. దేవుడి బిడ్డలుగా ప్రచారమైనప్పటికీ మధ్యలోనే రాలిపోయినట్టు గుర్తుచేశాడు. అయితే ఎవరు దేవుణ్ణి విశ్వసిస్తారో, మనసును దేవుడిపై నిమగ్నంచేసి, ఆయనపై ఆధారపడతారో.. వారికి సంపూర్ణ శాంతి అనుగ్రహించి కాపాడతాడు. ఎన్నో అద్భుతాలు చేసిన ఏసుక్రీస్తు- ‘మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది’- అంటూ రోగులతో చెప్పడం గమనార్హం. నమ్మకం ఉన్న వారు ఎన్నో గొప్ప పనులు నెరవేర్చగలరని చెప్పాడు. యోబు భక్తునికి ఎన్ని శ్రమలు కలిగినా, నమ్మకం కోల్పోకుండా నిలకడగా ఉండటంతోనే దైవం నుంచి రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. అలా నమ్మినప్పుడే లోకంలో వచ్చే ఆటంకాలు, అపజయాలను అధిగమించడంతో పాటు మరణానంతరం దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తోంది.

-బందెల స్టెర్జి రాజన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని