గంటలు ఎందుకు కొడతారంటే..

ప్రతి గుడిలో గంటలుంటాయి. గుడికి వెళ్లిన వాళ్లు గంటలు కొడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు గంట ఎందుకు కొడతారు. దీని పరమార్థం ఏమిటనేది కొందరికి తెలియకపోవచ్చు.

Published : 04 Apr 2024 00:13 IST

ప్రతి గుడిలో గంటలుంటాయి. గుడికి వెళ్లిన వాళ్లు గంటలు కొడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు గంట ఎందుకు కొడతారు. దీని పరమార్థం ఏమిటనేది కొందరికి తెలియకపోవచ్చు. గంట కొట్టగా వచ్చే ధ్వనిలోంచి ‘ఓం’ అనే ప్రణవ నాదం వెలువడుతుంది. ఈ నాదం మనోచింతలను దూరంచేసి ఏకాగ్ర చిత్తాన్ని కలిగిస్తుంది. విగ్రహాల్లోకి దేవతలను ఆవాహన చేయడానికి హారతి గంటను మోగిస్తారు. గంట నాలుకలో సరస్వతీమాత కొలువై ఉంటుందని, గంట ఉదర భాగంలో మహారుద్రుడు, ముఖ భాగంలో బ్రహ్మ, కొన భాగంలో వాసుకి, పైన ఉండే పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంటకు భారతీయ సంప్రదాయంలో పవిత్ర స్థానం ఉంది. గంటానాదం శుభాన్ని కలిగిస్తుంది. గంట మోగుతున్నప్పుడు వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి. మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.

ఇంట్లో పూజా సమయాల్లో మోగించే గంట శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంత దూరం వరకూ దుష్ట శక్తులు దరిచేరవు. గంటను ఏదో విధంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి. అప్పుడే శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ధూప దీప నైవేద్యాల సమయంలో గంట మోగించడం వల్ల పూజా ఫలం సంపూర్ణంగా లభిస్తుంది.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని