రంజాన్‌ శిక్షణ కొనసాగాలి!

ఒక వ్యక్తి తృప్తిగా భుజించి.. మరుక్షణం నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేసుకుంటే.. ప్రయోజనం లేదు కదా! తిన్న ఆహారం జీర్ణమై, రక్తంగా మారితేనే శక్తి వస్తుంది.

Updated : 18 Apr 2024 04:09 IST

ఒక వ్యక్తి తృప్తిగా భుజించి.. మరుక్షణం నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేసుకుంటే.. ప్రయోజనం లేదు కదా! తిన్న ఆహారం జీర్ణమై, రక్తంగా మారితేనే శక్తి వస్తుంది. ఈ ఉదాహరణ రంజాన్‌ నెలకు వర్తిస్తుంది. 30 రోజుల ఉపవాసాలు ఇచ్చిన నైతిక శిక్షణను ఈద్‌ తర్వాత కూడా కొనసాగిస్తే మిగతా 11నెలలూ ఆ ప్రభావం మనపై కనిపిస్తుంది. రంజాన్‌లో పొందిన ఆధ్యాత్మిక శిక్షణ ఈ మాసం ముగిసిన తర్వాత కూడా కొనసాగేలా చేయాలి. ఆ సంకల్పం బలపడాలన్నదే ఉలమాల ఉద్బోధ. అప్పుడే రంజాన్‌ శుభాలకు సార్థకత.

  •  ఇఫ్తార్‌లో ఒక వ్యక్తి ఆకలి తీరిస్తే రోజంతా ఉపవాసం పాటించినంత పుణ్యప్రదం. ఆ ఉత్తమ గుణం మిగతా 11నెలలూ అలవాటుగా చేసుకుంటేనే ఉపవాసాలకు సార్థకత.
  •  రోజాలు పాటించేవారు తెల్లవారు జామున లేచి సహరీ భుజించేందుకు వేళకు నిద్రలేవాలి. రోజువారీ పనులు చేసుకుంటూనే నిర్ణీత వేళల్లో నమాజ్‌ చేయాలి. ఇఫ్తార్‌, సహరీ, నమాజ్‌లతో క్రమశిక్షణ, సహనం, సమయపాలన అలవడతాయి. అవి తర్వాత కూడా పాటించినప్పుడే రంజాన్‌ శిక్షణ నెరవేరుతుంది.
  • అల్లాహ్‌ కృప పొందేందుకు, మనో కాంక్షలకు కళ్లెంవేసేందుకు, ఆలోచనలను అదుపులో పెట్టుకునేందుకు ఉపవాసాలు పాటించడం. తర్వాత కూడా ఈ మార్పు కొనసాగాలన్నదే అల్లాహ్‌ అభిమతం.
  • ధర్మసంపాదనతోనే ఇఫ్తార్‌ విందు ఇవ్వాలి. అధర్మంగా వచ్చే పంచభక్షాల కంటే ధర్మబద్ధంగా ఆర్జించిన గుప్పెడు మెతుకులే చాలనే సంకల్పానికి బలం చేకూరుతుంది. మిగతా రోజుల్లోనూ రంజాన్‌ స్ఫూర్తిగా నిలవాలి.
  • ఇఫ్తార్‌లో ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆహారాన్ని పంచుకు తినడం కనిపిస్తుంది. రంజాన్‌లో అలవడే ఈ సమాదరణ తర్వాత కూడా కొనసాగాలి.
  •  స్వీయసంస్కరణకు సాధనమైన రంజాన్‌ శిక్షణను తర్వాత కూడా కొనసాగిస్తేనే రంజాన్‌ ఉపవాసాలు ఫలవంతమవుతాయని ఉలమాలు చెబుతారు. రంజాన్‌లో వచ్చిన మార్పు మిగతా 11నెలలూ కొనసాగాలి.. ఈ మార్పు జీవితాంతం ఉండాలన్నదే అల్లాహ్‌ అభిమతం.

- తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని