కంటికి కనిపించని శత్రువు

మనల్ని ఏదో రూపంలో కష్టపెడుతూ, అభివృద్ధికి ఆటంకం కలిగించేవారిని శత్రువులుగా గుర్తిస్తాం. వారి విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ కంటికి కనిపించని మరో అజ్ఞాత శత్రువు సాతాను.

Published : 25 Apr 2024 00:07 IST

క్రీస్తువాణి

నల్ని ఏదో రూపంలో కష్టపెడుతూ, అభివృద్ధికి ఆటంకం కలిగించేవారిని శత్రువులుగా గుర్తిస్తాం. వారి విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ కంటికి కనిపించని మరో అజ్ఞాత శత్రువు సాతాను. అతణ్ణి గుర్తించడం అంత సులభం కాదు. మనల్ని దేవుడి నుంచి దూరంచేసి పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా అగ్నిగుండంలో పడేసేందుకు సర్వశక్తులూ ప్రయోగిస్తాడు. అతడు మహా బలవంతుడు, యుక్తిపరుడు. మనం సంతోషంగా గడుపుతూ, దైవసన్నిధిలో జీవితాన్ని పూలబాటగా చేసుకునే అన్ని మార్గాలనూ అడ్డగిస్తాడు. సాతానును గుర్తించి, అతడు చేసే దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. శత్రువెవరో తెలియకపోతే యుద్ధం ఎలా చేయగలం?

మనల్ని లక్ష్యంగా పెట్టుకుని సాతాను ఆట సాగిస్తుంటాడు. ప్రభువే మనకు రక్షకుడని, ఆయన ద్వారా క్షమాపణ, స్వర్గ ప్రాప్తి కలుగుతాయనే సత్యాన్ని గ్రహించి, అవి దక్కకుండా చేయడానికి తనదైన శైలిలో ప్రయత్నిస్తుంటాడు. మనల్ని దైవసన్నిధి నుంచి దూరం చేయడానికి కుయుక్తులు పన్నుతుంటాడు. మనం దేవుడి అధీనంలో ఉండి, సాతానును ఎదిరించినప్పుడు.. అతడు పారిపోతాడు. సాతాను వేరేవేరే దారుల్లో పనిచేస్తాడు. జీవితం నిస్సారం అనిపించేలా చేస్తాడు. జీవితాన్ని సఫలీకృతం చేసుకునే మార్గాలనూ, సంతోషాలనూ దూరంచేస్తాడు. అణచివేతకు గురయ్యేలా, మానసిక వైకల్యం కలిగేలా, దుర్వ్యసనాలకు బానిసలయ్యేలా చేస్తాడు. జీవితంపై విరక్తిచెంది, ఆత్మస్థైర్యం కోల్పోయి, న్యూనతకు లోనవుతాం. సాతాను ఏదైనా చేయొచ్చు గాక.. మనం గాఢంగా విశ్వసించే దైవాన్ని మాత్రం వక్రంగా మార్చలేడు. అతడు దేనికీ తొణకడు కానీ ప్రార్థనకు జడుస్తాడు. కనుక మనం పాపాలకు దూరంగా ఉంటూ, దైవాన్ని ప్రార్థిస్తుండాలి. అప్పుడే ఆ అజ్ఞాత శత్రువును జయించగలం.

ఎమ్‌.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని