మంచి పేరు పెట్టాలి!

ముహమ్మద్‌ ప్రవక్త (స) ఓ వ్యక్తిని మేక పాలు తెమ్మన్నారు. అతను లేచి పాలు పితకడానికి వెళ్లబోతుంటే.. ‘నీ పేరేంటి?’ అనడిగారు.

Published : 09 May 2024 00:13 IST

ముహమ్మద్‌ ప్రవక్త (స) ఓ వ్యక్తిని మేక పాలు తెమ్మన్నారు. అతను లేచి పాలు పితకడానికి వెళ్లబోతుంటే.. ‘నీ పేరేంటి?’ అనడిగారు. అతడు ‘మురా’ అని చెప్పగానే.. పాలు పితకవద్దన్నారు ప్రవక్త. కారణం ఆ పేరుకు చేదని అర్థం. మరో వ్యక్తికి ఆ పని చెబుతూ పేరడిగారు. ‘హర్బ్‌’ అనడంతో అతన్నీ వద్దన్నారు. ‘యుద్ధం’ అన్నది నామార్థం. మూడో వ్యక్తి ‘యయీష్‌’ అని చెప్పగానే.. పాలు పితకమన్నారు. జీవనం అనేది ఆ పేరుకు అర్థం.

ప్రవక్త ఒకసారి రెండు పర్వతాల మధ్య నుంచి ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడికి చేరగానే ఒంటె దిగి.. పక్కనున్న సహచరుణ్ణి ‘వీటి పేర్లేంటి?’ అనడిగారు. ‘ఫాజిహ్‌, ముఖ్‌జీహ్‌’ అంటూ జవాబిచ్చాడతను. అవమానించేది, అపార్థాలకు గురిచేసేది- అనేవి ఆ పేర్లకు అర్థం. వెంటనే ప్రవక్త (స) ఆ దారి వదిలేసి మరో మార్గంలో వెళ్లారు. తమ సహచరుల్లో ఎవరి పేరైనా అర్థవంతంగా లేకపోతే వెంటనే మార్చేసే వారు. ‘పిల్లలకు మంచి పేర్లు పెట్టాలి, ఆ ప్రభావం ఎంతగానో ఉంటుంది’ అనేవారాయన. కనుక శిశువు పుట్టిన ఏడో రోజున పుట్టెంట్రుకలు తీసి, మంచి పేరు పెట్టడం శుభదాయకం. చిన్నారులకు వారి నామార్థాన్ని వివరించాలి. దానికి సార్థకత చేకూర్చేలా పెంచాలి. పేరు గురించి బాగా ఆలోచించి తప్పు భావం రాకుండా మంచి అర్థం వచ్చేలా పెట్టాలి. ‘ప్రళయ దినాన మీమీ పేర్లతో పిలుస్తారు’ అన్నారు ప్రవక్త.     

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని