ముగ్గురూ ఒక్కరే!

మన గురించి పరలోకంలో సాక్ష్యమిచ్చేవారు ముగ్గురున్నారు.

Published : 09 May 2024 00:13 IST

న గురించి పరలోకంలో సాక్ష్యమిచ్చేవారు ముగ్గురున్నారు. వారెవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. నిజానికి ఈ ముగ్గురూ ఒక్కరే. వీరు దైవికంగా సమాన తెలివి, విజ్ఞత ఉన్నవారు. వీరి మధ్య హెచ్చుతగ్గులు లేవు. అది ఎలాగంటే.. పంఖాకు మూడు రెక్కలు ఉన్నప్పటికీ.. అది తిరిగేటప్పుడు ఒక్కటిగానే గోచరిస్తుంది. అలాగే ఈ ముగ్గురూ సమానమైన దైవాంశసంభూతులు. వీరెవ్వరినీ ఒకరు సృజించలేదు. వీరికి మరణం కూడా లేదు. ముగ్గురూ సర్వవ్యాపితమైన వారు, మహాజ్ఞానులు, సర్వజ్ఞత కలిగిన వారు. అందువల్లే ప్రభువు తన శిష్యులకు తండ్రి. కుమార, పరిశుద్ధాత్మ- అంటూ బాప్తిజమ్‌ ఇవ్వాలని చెప్పాడు. వీరిని మనం విభజించి చూడలేం. కనుక ముగ్గురిగా కలిసున్న దైవాన్నే ఆరాధించాలి. ప్రాణం, దేహం, ఆత్మ.. అనేది దీనికి పోలికగా ఉన్నాయని ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి. ఈ అంశాన్ని అర్థం చేసుకుని హృదయపూర్వకంగా ప్రార్థించి పరలోక ప్రాప్తి పొందాలి.

పి.అవనీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని