లక్ష్మీదేవికి ప్రీతికరం శంఖం

హిందువుల పూజా విధి విధానాల్లో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ‘శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు’ అంటారు.

Published : 16 May 2024 00:18 IST

హిందువుల పూజా విధి విధానాల్లో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ‘శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు’ అంటారు. శంఖాల్లో చాలా రకాలున్నాయి. ఆయా రకాలను బట్టి పూజా విధానాలుంటాయి. శంఖచూడుడు అనే రాక్షసుడి భార్య తులసి. తన భర్తను శివుడు సంహరించగా.. తులసి అతడి భస్మాన్ని శంఖంగా మార్చిందని పురాణ కథనం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో శంఖం ఒకటి. శంఖం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. శంఖ ధ్వనితో ఆ ప్రాంతాల్లో చెడు తొలగిపోతుంది, భయాలు దూరమవుతాయి. శంఖం నుంచి వచ్చే శబ్దంతో క్రిమికీటకాలు నశిస్తాయని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ప్రయోగాలతో నిరూపించారు. శంఖాన్ని పలు ద్రవ్యాలతో శుద్ధి చేసిన తర్వాత పూజగదిలో ఉంచి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. శంఖంలో పోసిన జలానికి శక్తి లభిస్తుందని ఆయుర్వేద శాస్త్రం వెల్లడించింది. శంఖుతీర్థం ఆరోగ్యదాయకం. ఈ తీర్థ సేవనతో రోగనిరోధకశక్తి వృద్ధిచెందుతుంది. శంఖుతీర్థాన్ని ఇంట్లో నాలుగు మూలలా చల్లినట్లయితే వాస్తు దోషాలు తొలగుతాయి. ఈ విశ్వాసంతోనే అనేక శుభకార్యాల్లో శంఖాన్ని ఉపయోగించడం ఆచారమైంది.               

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని