AAI Recruitment: ఏఏఐలో 342 ఉద్యోగాలు.. వేతనం ఎంతో తెలుసా?

Airports Authority of India Jobs: ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది.

Updated : 23 Jul 2023 16:03 IST

దిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.  వివిధ విభాగాల్లో మొత్తం 342 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించనుంది. జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌), సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌),  ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

బ్యాంక్‌ క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • పోస్టుల వివరాలివే..  మొత్తం 342 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 9 పోస్టులు ఉండగా.. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్‌): 9; జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్): 237; జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్): 66; జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) 3; జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా): 18  చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నారు.
  • అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • వయో పరిమితి: 04.09.2023 నాటికి సీనియర్/ జూనియర్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించరాదు. 
  • వేతన స్కేలు: ఉద్యోగాలకు ఎంపికైన ఆయా హోదాలను బట్టి  వేతనం ఇస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు నెల వేతనం రూ.40,000-రూ.1,40,000; జూనియర్ అసిస్టెంట్‌కు రూ.31,000-రూ.92,000; సీనియర్ అసిస్టెంట్‌కు రూ.36,000-రూ.1,10,000 
  • ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని