కరెంట్‌ అఫైర్స్‌

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఏ రాష్ట్ర ప్రైమరీలో డొనాల్డ్‌ ట్రంప్‌పై నెగ్గి చరిత్ర సృష్టించారు?

Updated : 09 May 2024 04:23 IST

మాదిరి ప్రశ్నలు

  • అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఏ రాష్ట్ర ప్రైమరీలో డొనాల్డ్‌ ట్రంప్‌పై నెగ్గి చరిత్ర సృష్టించారు? (ఈ విజయంతో ఈమె రిపబ్లికన్‌ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. దీంతోపాటు అటు  డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల తరఫున ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికన్‌గా కూడా నిలిచారు. ఈ ప్రైమరీలో హేలీకి 51 శాతం ఓట్లు రాగా, ట్రంప్‌ కేవలం 33.2 శాతం ఓట్లకే పరిమితమయ్యారు.)

జ: వాషింగ్టన్‌ డీసీ 

  • ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా ఏ దేశానికి చెందిన 57 ఏళ్ల బెర్ట్‌ జాన్సన్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు? (గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతడి గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయని పరిస్థితుల్లో, ఆరు నెలల కంటే ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండెను ఈయనకు అమర్చారు. 1984లో గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు.)  

జ: నెదర్లాండ్స్‌

  • 2024 సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాను 6.1 నుంచి ఎంత శాతానికి పెంచుతున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ఇటీవల ప్రకటించింది? (2023లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి బలమైన పనితీరు కనబరచడం వల్లే 2024 అంచనాలను పెంచినట్లు మూడీస్‌ పేర్కొంది.)

జ: 6.8 శాతం



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని