డిగ్రీని ఇప్పుడు కొనసాగించవచ్చా?

కాకతీయ వర్సిటీలో బీకాం కంప్యూటర్స్‌ (2014-17) చదివాను.

Published : 02 Apr 2024 00:38 IST

కాకతీయ వర్సిటీలో బీకాం కంప్యూటర్స్‌ (2014-17) చదివాను. మూడో ఏడాది అన్నీ, మొదటి, రెండో ఏడాదుల్లో కొన్నీ సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈ డిగ్రీ ఇప్పుడు కొనసాగించొచ్చా? ఓపెన్‌ వర్సిటీలో డిగ్రీ చేయొచ్చా?               

 అక్రం షేక్‌

 సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రోగ్రాం పూర్తి చేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ యూనివర్సిటీల నిబంధనల ప్రకారం నిర్దేశించి ఉంటాయి. ఉదాహరణకు.. బీఏ/ బీఎస్సీ/ బీకాం డిగ్రీ కోర్సును కనిష్ఠంగా మూడు ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి. గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే, ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు డిగ్రీకి గరిష్ఠ పరిమితిని 5 సంవత్సరాలుగా, కొన్ని మాత్రం 6 సంవత్సరాలుగా నిర్ణయించాయి. కాకతీయ యూనివర్సిటీలో మూడేళ్ల డిగ్రీని ఆరేళ్లలో పూర్తిచేయాలి. మీరు 2014లో బీకాంలో చేరారు కాబట్టి, 2020 లోగా పూర్తి చేయాల్సింది. మీరు డిగ్రీ చదివినప్పుడు సంవత్సరాంత పరీక్షలు ఉన్నాయి. 2015/ 2016 తరువాత దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలూ సెమిస్టర్‌ విధానంలోకి మారిపోయాయి. అందుకని మీరిప్పుడు బీకాం డిగ్రీని కొనసాగించలేరు. ఒకవేళ కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్తులో ఎప్పుడైనా డిగ్రీ పూర్తి చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చినా, మీకు చాలా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి కాబట్టి, ఒకేసారి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత కష్టం అవుతుంది. ఓపెన్‌ యూనివర్సిటీలో మరో డిగ్రీ చదవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కాకతీయ యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.      

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని