దేన్ని ఎంచుకోను?

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పరీక్షలు రాశాను. ఇంజినీరింగ్‌ చేయాలని లేదు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పెంచుకోడానికి బీఎస్సీ కంప్యూటర్స్‌,  బీసీఏల్లో ఏది మెరుగు? బీసీఏకి భవిష్యత్తు ఉందా?

Published : 02 Apr 2024 23:49 IST

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పరీక్షలు రాశాను. ఇంజినీరింగ్‌ చేయాలని లేదు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పెంచుకోడానికి బీఎస్సీ కంప్యూటర్స్‌,  బీసీఏల్లో ఏది మెరుగు? బీసీఏకి భవిష్యత్తు ఉందా?             

- వేదప్రకాశ్‌

కంప్యూటర్‌ రంగంలో పరిజ్ఞానం పెంపొందించుకోవాలనుకుంటే బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, బీకాం (కంప్యూటర్స్‌) కానీ చదవొచ్చు. బీఎస్సీలో కంప్యూటర్‌ కోర్సును మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ స్టాటిస్టిక్స్‌ లాంటి మరో రెండు సబ్జెక్టులతో కలిపి చదువుతారు. బీకాంలో కామర్స్‌ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్స్‌ కూడా చదువుతారు. బీసీఏలో అయితే మూడు సంవత్సరాల పాటు కంప్యూటర్స్‌ సంబంధిత కోర్సులు మాత్రమే చదువుతారు. కాబట్టి బీసీఏ చదివినవారికి కంప్యూటర్స్‌/ సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రోగ్రాంల భవిష్యత్తు విషయానికొస్తే బీఎస్సీ (కంప్యూటర్స్‌) డిగ్రీతో వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఆ తరువాత ఎంసీఏ కానీ, ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌/ డేటా సైన్స్‌) కానీ చేయాలి. బీసీఏ చదివితే మీ నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం ఆధారంగా వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి.

 బీఎస్సీ చదివినా, బీసీఏ చదివినా, ఎంసీఏ, ఎంబీఏ - జనరల్‌, ఎంబీఏ - బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కోర్సుల్లో చేరవచ్చు. మీ దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. బీటెక్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ చదివేవారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బీసీఏ ప్రోగ్రాంకు కొంత ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకొంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. చివరిగా ప్రతి డిగ్రీకీ ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. కానీ ఉద్యోగం రావడం అనేది అభ్యర్థి ప్రతిభ, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార సామర్థ్యం, భావప్రకటన లాంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌,  కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని