కోర్సులా? కొలువా?

బీటెక్‌ సివిల్‌, తర్వాత ఎంబీఏలో హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ పూర్తిచేశాను. ఇప్పుడు అదనంగా కోర్సులు చేయనా? ఉద్యోగ ప్రయత్నాలు మేలా?

Published : 30 Apr 2024 00:05 IST

బీటెక్‌ సివిల్‌, తర్వాత ఎంబీఏలో హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ పూర్తిచేశాను. ఇప్పుడు అదనంగా కోర్సులు చేయనా? ఉద్యోగ ప్రయత్నాలు మేలా?

కోడూరి రాఘవేంద్రబాబు

బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాక ఎక్కడైనా ఉద్యోగం చేశారా? లేదా? మీకు బీటెక్‌, ఎంబీఏల్లో ఏ స్థాయి మార్కులు వచ్చాయి? ఎంబీఏ ఎక్కడ చదివారు? ఆ విద్యాసంస్థలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నారా?...ఈ వివరాలు చెప్పలేదు. ఎంబీఏలో హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ స్పెషలైజేషన్లు చదివారు కాబట్టి ఆ రెండు విభాగాల్లో మీకు నైపుణ్యాలు ఎక్కువున్న స్పెషలైజేషన్‌ ఎంచుకొని ఉద్యోగప్రయత్నాలు చేయండి. సాధారణంగా ఎంబీఏ చదివినవారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగం పొందడం సులువు. ఉద్యోగానుభవం లేకుండా నేరుగా సొంత ప్రయత్నాలతో ఉద్యోగం పొందడం కొంత కష్టమే! ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేదు. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అదనంగా కోర్సులు చేసి మీ ఉద్యోగావకాశాలను మెరుగు పర్చుకోండి. ప్రముఖ విద్యా/ శిక్షణ సంస్థల నుంచి సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం ఉపయోగకరం. ఈ మధ్య కాలంలో డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రంగాల్లో అదనపు కోర్సులు చేసే ప్రయత్నం చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని