ఎనిమిదేళ్ల ముందే మోకీళ్ల నొప్పి గుర్తింపు

మోకాలి కీళ్లు క్షీణించటాన్ని గుర్తించటానికి ఎక్స్‌రే తీస్తుంటారు. ఇందులో మార్పులు కనిపించేసరికే ఎంతోకొంత సమస్య ముదిరిపోయి ఉంటుంది.

Published : 30 Apr 2024 00:05 IST

మోకాలి కీళ్లు క్షీణించటాన్ని గుర్తించటానికి ఎక్స్‌రే తీస్తుంటారు. ఇందులో మార్పులు కనిపించేసరికే ఎంతోకొంత సమస్య ముదిరిపోయి ఉంటుంది. మరి దీన్ని ముందుగా గుర్తించగలిగితే? అదీ కేవలం రక్త పరీక్షతోనే సాధ్యమైతే? డ్యూక్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అదే సాధించారు. ఎక్స్‌రేలో మోకీళ్ల క్షీణత సంకేతాలు కనిపించటానికి కనీసం ఎనిమిదేళ్ల ముందుగానే సమస్యను పసిగట్టే రక్త పరీక్షను రూపొందించారు. ఎముక క్షీణత జీవ సూచికల ఆధారంగా ఇది సమస్యను కచ్చితంగా గుర్తిస్తున్నట్టు రుజువైంది కూడా. దీని సాయంతో జబ్బు తలెత్తటాన్నే కాదు.. పురోగతినీ తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మోకాలి కీళ్లు అరగటం తరచూ చూసేదే. నొప్పి, వాపు వంటి లక్షణాలను తగ్గించుకోవటం తప్పించి ప్రస్తుతానికి దీన్ని నయం చేసే చికిత్సలేవీ లేవు. సమస్యను తొలిదశలోనే గుర్తిస్తే ముదరకుండా చూసే చికిత్సలను రూపొందించొచ్చు. ఈ దిశగా కొత్త పరీక్ష ఆశలు రేపుతోంది. దీని ద్వారా గుర్తించే జీవ సూచికలను జబ్బు నిర్ధరణతో పాటు పరిశోధనలకూ ఉపయోగించుకోవచ్చు. ఇది సమర్థమైన మందుల తయారీకి దారి చూపగలదు. ఈ పరీక్ష మోకీళ్ల అరుగుదలను 74% వరకూ అంచనా వేస్తున్నట్టు, 85% వరకూ నిర్ధరిస్తున్నట్టు ఇంతకుముందే తేలింది. తాజా అధ్యయనంతో దీని అంచనా సామర్థ్యాలు మరింత కచ్చితంగా రుజువయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని