మీ ఆహారంలో ‘బి’ ఉందా?

మనకు బి విటమిన్లు అత్యావశ్యకం. ఇవి కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవటానికి, అవి ఒకదాంతో...

Published : 10 Apr 2018 01:33 IST

ఆహారం
మీ ఆహారంలో  ‘బి’ ఉందా?

నకు బి విటమిన్లు అత్యావశ్యకం. ఇవి కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవటానికి, అవి ఒకదాంతో మరోటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి తోడ్పడతాయి. మన శరీరం జన్యు సంకేతాన్ని ‘చదువు’కోవటానికి దోహదం చేస్తాయి. అంతేకాదు.. ఎర్ర రక్తకణాల పుట్టుకురావటంలోనూ, నాడుల మధ్య సమాచారాన్ని చేరవేయటంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. అయితే బి విటమిన్లు నీళ్లలో కరిగిపోతాయి. వీటిని మన శరీరం నిల్వ ఉంచుకోలేదు. అందువల్ల ఆహారం ద్వారా నిరంతరం అందుకునేలా చూసుకోవటం తప్ప మరో మార్గం లేదు. చిక్కుళ్లు, పప్పులు, పొట్టుతీయని ధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో.. ముఖ్యంగా ఆకుకూరల్లో బి విటమిన్లు దండిగా ఉంటాయి. అయితే బి12 విటమిన్‌ మాత్రం జంతు సంబంధ ఆహారం ద్వారానే లభిస్తాయి. కాబట్టి శాకాహారులు బి12 మాత్రలను తీసుకోవటం ద్వారా దీని లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని