కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా

కేరళలోని కన్నూర్‌కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది.

Published : 08 May 2024 05:58 IST

ఈటీవీ భారత్‌: కేరళలోని కన్నూర్‌కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. కేరళలో మొట్టమొదటి కల్లుగీత మహిళా కార్మికురాలిగా ఈమె నిలిచింది. షీజా, జయకుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కార్పెంటరుగా పనిచేసే జయకుమార్‌ 2019లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు పని చేయలేకపోవడంతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ బాధ్యతను స్వీకరించిన షీజా వివిధ సామాజిక సంస్థలు, క్లబ్బుల నుంచి పలు అవార్డులను అందుకొంది. వ్యవసాయం కూడా చేస్తున్న ఈమె అన్నీ తానై భర్తను, పిల్లలను పోషించుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు