దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు

దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్‌ చేరుకున్నాయి.

Published : 08 May 2024 06:14 IST

సింగపూర్‌: దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్‌ చేరుకున్నాయి. రెండుదేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో ఈ మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ దిల్లీ, శక్తి, కిల్టాన్‌ యుద్ధనౌకలు సోమవారం సింగపూర్‌ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. మూడు రోజుల పాటు ఈ వార్‌షిప్‌లు ఇక్కడే ఉంటాయి. అనంతరం ఈ యుద్ధనౌకలు మలేసియాకు ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌కు వెళతాయి. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ యుద్ధనౌకలతో చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని డ్రాగన్‌ వాదిస్తోంది. దీన్ని ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రునై, తైవాన్‌లు వ్యతిరేకిస్తున్నాయి. సాగరంలో తన హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్‌.. అమెరికా మద్దతుతో గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో డ్రాగన్‌ నౌకాదళంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు