తోటి పిటిషనర్‌గా హనుమాన్‌ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా

దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొన్నారు.

Published : 08 May 2024 06:08 IST

దిల్లీ: దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొన్నారు. ఈ భూమి హనుమంతుడిదని, అది ఆయనకే చెందాలని.. హనుమంతుడిని కొలిచే ఓ భక్తుడిగా, స్నేహితుడిగా భూమిని సంరక్షించేందుకు కోర్టులో అభ్యర్థనను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సి.హరి శంకర్‌ ధర్మాసనం.. ఆస్తిని లాక్కొవాలనే ఉద్దేశంతోనే కక్షిదారు పిటిషన్‌ను దాఖలు చేశారని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. అనంతరం ప్రస్తుత యజమానులకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని