‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్‌.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి.

Updated : 08 May 2024 07:13 IST

55కు పైగా ఛానళ్లలో ప్రదర్శితం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. దాదాపు 55కు పైగా ఛానళ్లలో ఈ సినిమా ఉంది. రోజురోజూకీ ఈ సినిమా చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఎలాంటి ప్రచారం లేకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ సినిమా ఎన్నికల సమయంలో సంచలనం సృష్టిస్తోంది. కామెంట్లను గమనిస్తే.. కేవలం ఏపీయే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రజలూ చూస్తున్నట్లు అర్థమవుతోంది. సామాజిక మాధ్యమంలో విడుదలైన ఓ సాధారణ తెలుగు సినిమాని ప్రజలు ఇంతలా ఆదరించడం ఓ రికార్డుగా చెప్పవచ్చు. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.

మార్చి 27న విడుదలైన ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా చూశారు. అందులోని ఒక్కో సన్నివేశాన్ని విడిగా చూడటానికీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా యూట్యూబ్‌లో ఏ చిన్న వీడియో చూసినా ఒకటి, రెండు ప్రకటనలు రావడం సర్వసాధారణం. కానీ.. ప్రధాన ఛానల్‌లో చూసేటప్పుడు ఒక్క ప్రకటనా రాకపోవడం గమనార్హం. అంటే.. ఆదాయాన్ని ఆశించకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రూపొందించి, విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియోని ఎన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో అప్‌లోడ్‌ చేసినా ఆ నిర్వాహకులకు.. ప్రధాన ఛానల్‌, సినిమా రూపొందించిన వారు కాపీరైట్స్‌ పంపలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు