సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

Updated : 02 Apr 2021 01:14 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు: సుడోకు

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం..

but, did, do, find, help, know, now, run, take

అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన

క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.

పొడుపు కథలు
1. అందరి కన్నా అందగాడు.. రోజుకొకలా తయారవుతాడు.. ఆఖరుకు నిండుసున్నా అవుతాడు. ఎవరది?
2. నల్లని రూపంలో ఉంటా. నాలుగు చెవులతో ఉంటా. తింటే కరకర.. నాలుక చురచుర మంట.. ఇంతకీ నేను ఎవర్ని?
3. పగలు తపస్వి.. రాత్రి భయంకర రాక్షసి?
4. అందరూ నన్ను తినటానికి కొనుక్కుంటారు. కానీ ఎవరూ నన్ను తినరు?

చెప్పగలరా?
రాముకి నలుగురు కొడుకులు. ప్రతి కొడుకుకి ఒక

చెల్లెలుంది. అంటే రాముకి ఎంతమంది పిల్లలున్నట్లు?

మిఠాయిల్ని కనిపెట్టండి


కింది వాక్యాల్లో దాగున్న మిఠాయిల పేర్లని గుర్తించి పట్టుకుంటారా?

1. నీకా జాతరలో తమ్ముడు కనిపించలేదా?
2. ఈ పని పూర్తిచేయడానికి ఇంకో వారం పడుతుందా?
3. నువ్వు పూర్తి చేసిన ఆ పజిలే బీరువాలో ఉన్న పజిల్‌.
4. వీటిల్లో రోజాకే కుచ్చులున్న డ్రస్సు.

నేను గీసిన బొమ్మ

అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

జవాబులు:

అక్షరాల రైలు: ASTRONATUTS

పొడుపు కథలు: 1. చంద్రుడు  2. లవంగం 3. గబ్బిలం 4. కంచం

మిఠాయిల్ని కనిపెట్టండి: 1. కాజా 2. కోవా  3. జిలేబీ 4. కేకు

చెప్పగలరా: ఐదుగురు. (నలుగురు కొడుకులు, ఒక కూతురు. అందరికంటే చిన్నపిల్ల అందరికీ చెల్లెలు అవుతుంది కదా.)

అది ఏది: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని