అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 30 Apr 2024 05:43 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?





అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘కలం’లో ఉంటాను. కానీ ‘జలం’లో ఉండను. ‘లత’లో ఉంటాను. కానీ ‘మేత’లో ఉండను. ‘వల’లో ఉంటాను. కానీ ‘వెల’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. కానీ ‘వేగు’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. అయిదక్షరాల పదాన్ని నేను. ‘నీరు’లో ఉంటాను. కానీ ‘కారు’లో ఉండను. ‘ధాటి’లో ఉంటాను. కానీ ‘ధాన్యం’లో ఉండను. ‘ఏకం’లో ఉంటాను. కానీ ‘పాకం’లో ఉండను. ‘నువ్వు’లో ఉంటాను. కానీ ‘నవ్వు’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. కానీ ‘బడి’లో ఉండను. నేనెవర్ని?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. అదేంటో కనిపెట్టండి.

1. కుక్క, పిచ్చుక, చేప, తోడేలు
2. ద్రాక్ష, మామిడిపండు, పుచ్చకాయ, ఉసిరి
3. ఫ్లూట్‌, మ్యూజిక్‌, పెన్ను, డ్రమ్‌
4. ఇత్తడి, బంగారం, వెండి, కాంస్యం


తప్పులే.. తప్పులు..!

కింద ఇచ్చిన పదాల్లో కొన్ని అక్షరదోషాలున్నాయి. వాటిని సరిజేసి రాయండి.

1.అద్రుష్టం ...........
2.వేధిక ...........
3.కార్యాక్రమం ...........
4.అరునోదయం ...........
5.అత్మరక్షణ ...........
6.ఆంద్రప్రదేశ్‌ ...........


జవాబులు

అది ఏది?: 2
బొమ్మల్లో ఏముందో?:1.SLATE 2.ANT 3.TRAIN 4.ROBOT 5.ONION
పదవలయం: 1.జననం 2.పతనం 3.భవనం 4.సహనం 5.వేతనం 6.ప్రధానం 7.ఆహ్వానం 8.విమానం
తప్పులే.. తప్పులు..!: 1.అదృష్టం 2.వేదిక 3.కార్యక్రమం 4.అరుణోదయం 5.ఆత్మరక్షణ 6.ఆంధ్రప్రదేశ్‌  
అక్షరాల చెట్టు: అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
ఆ ఒక్కటి ఏది?: 1.చేప 2.ఉసిరి 3.పెన్ను 4.ఇత్తడి
రాయగలరా?: 1.తరగతి గది 2.వంట చెరకు 3.గోరువంక 4.మంచు కొండ 5.రంగునీళ్లు 6.చెత్తబుట్ట 7.భువనగిరి 8.హంసల దీవి 9.రామరాజ్యం 10.రాగమాల 11.అష్టదిగ్గజం 12.కోయిల కూత 13.బంతిపువ్వు 14.పావురాయి 15.నీటిబుడగ
నేనెవర్ని?: 1.కలవరం 2.నీటి ఏనుగు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని