పిల్లలూ.. ఇవిగో మీసాల పిల్లులు!

పిల్లలూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్పోజబుల్‌ ప్లేట్లు, గ్లాసులే కనిపిస్తున్నాయి కదా! వాటిని కేవలం తినేందుకు, తాగేందుకే కాకుండా చిన్న చిన్న బొమ్మలు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు అందుబాటులో

Updated : 11 Feb 2021 01:53 IST

చూడండి.. చెయ్యండి

పిల్లలూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్పోజబుల్‌ ప్లేట్లు, గ్లాసులే కనిపిస్తున్నాయి కదా! వాటిని కేవలం తినేందుకు, తాగేందుకే కాకుండా చిన్న చిన్న బొమ్మలు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే వస్తువులతో మీసాల పిల్లిని తయారు చేసుకోవచ్చు. ఆ బొమ్మలను ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!  
కావాల్సిన వస్తువులు
1. పేపర్‌ ప్లేట్లు, తీగలు
2. రంగుల కాగితాలు, డెకరేషన్‌ రిబ్బన్‌
3. కత్తెర, జిగురు

ఎలా చేయాలంటే..
ముందుగా రంగు కాగితాలు తీసుకొని పిల్లి చెవులు, కనుగుడ్ల మాదిరి కత్తిరించుకోవాలి. తర్వాత మూడు, నాలుగు తీగలు తీసుకొని ఫొటోలో చూపించినట్లు వాటి మధ్య భాగాలను మెలి తిప్పి.. ఓ గుత్తిలా చేసుకోవాలి. తర్వాత ఒక పేపర్‌ ప్లేట్‌ లేదా థర్మాకోల్‌ ప్లేట్‌ తీసుకోవాలి. దాని మధ్యలో జిగురు సహాయంతో తీగల గుత్తిని మీసాలలా అతికించాలి. ఇంట్లో ఉలెన్‌ ఉండ ఉంటే దాన్ని ఫొటోలో చూపినట్లు మీసాల మధ్యలో అంటే.. గుండ్రని ముక్కులా అతికించాలి. ఉలెన్‌ రోల్‌ లేకపోతే చిన్న ప్లాస్టిక్‌ బాల్‌ అయినా పర్లేదు. ముందే కత్తిరించి పెట్టుకున్న కాగిత కనుగుడ్లను, చెవులను ప్లేట్‌ పైన అంటించాలి. దీన్ని గోడకు తగిలించుకునేలా ఒక రిబ్బన్‌ను హ్యాంగర్‌ మాదిరి పెడితే.. క్రాఫ్ట్‌ రెడీ అయినట్లే. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని.. మీ గదిలోనో, హాల్లోనో అందంగా అలంకరిస్తే సరి. పెద్ద పెద్ద మీసాలతో పిల్లి బొమ్మలను చూస్తుంటే భలే నవ్వొస్తుంది కదూ! మీరూ ఒకసారి ప్రయత్నించండి మరి..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని