నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌! అందరూ బాగున్నారా!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. పొద్దున్నే లేచి.. నాన్నతో వాకింగ్‌కు వెళతాను. పుస్తకాలను శుభ్రంగా ఉంచుకుంటాను. నా పుస్తకాలన్నీ నేనే సర్దుకుంటాను.

Updated : 08 Jan 2022 05:11 IST

పొద్దున్నే లేస్తాను!

హాయ్‌ ఫ్రెండ్స్‌! అందరూ బాగున్నారా!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే.. పొద్దున్నే లేచి.. నాన్నతో వాకింగ్‌కు వెళతాను. పుస్తకాలను శుభ్రంగా ఉంచుకుంటాను. నా పుస్తకాలన్నీ నేనే సర్దుకుంటాను. రోజూ నేను చేయాల్సిన పనులన్నీ డైరీలో రాసుకుంటాను. దాన్ని బట్టి వాయిదా వేయకుండా ఏ రోజు పని ఆ రోజే చేస్తానన్నమాట. అలాగే మా అమ్మతో కలిసి రోజూ మొక్కలకు నీళ్లు పోస్తాను. అమ్మ చెప్పినట్లు వింటాను. ఫోన్‌లో వీడియో గేమ్స్‌ ఆడటం మానేస్తాను.  ఖాళీ సమయంలో నాన్నమ్మ, తాతయ్యలతో గడుపుతాను. బడికి మారాం చేయకుండా వెళతాను.

- నిమ్మగడ్డ కేశజ్ఞ శరణ్‌, మూడో తరగతి, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని