నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌! అందరూ బాగున్నారా!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే..  ‘చెప్పిన మాట వినని పెంకి పిల్లాడు’ అని అమ్మానాన్న ఎప్పుడూ కోప్పడుతూ

Published : 12 Jan 2022 01:33 IST

గుడ్‌ బాయ్‌ అనిపించుకుంటా! 

హాయ్‌ ఫ్రెండ్స్‌! అందరూ బాగున్నారా!  నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నా అంటే..  ‘చెప్పిన మాట వినని పెంకి పిల్లాడు’ అని అమ్మానాన్న ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారు.. ముద్దుగానే లెండి! కానీ ఆ మాత్రం కూడా అనిపించుకోవడం దేనికి..? అందుకే బుద్ధిగా ఉందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్‌. అప్పుడు అందరూ నన్ను ‘గుడ్‌ బాయ్‌’ అంటారు కదా! అలాగే చెల్లిని ఏడిపించకుండా తనతో మంచిగా ఆడుకోవాలి. గొడవ చేయకుండా స్కూల్‌కు వెళ్లాలి. బోలెడు పాఠాలు నేర్చుకోవాలి. ఇవన్నీ చేయాలనుకుంటున్నా.. చేస్తాను కూడా! 

- నిర్వాణ్‌ శ్రీనివాస్‌ కంటిపూడి, ఎల్‌కేజీ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని